18 ఏళ్ల తర్వాత అద్భుత కలయిక.. ఈ రాశులకు సంపద కలిసివస్తుంది
జ్యోతిష్యం ప్రకారం సంపదకు, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు ఈనెల చివరలో మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. అలాగే రాహువు కూడా అక్కడే ఉన్నాడు. దీనివల్ల మీనరాశిలో రెండు మిత్ర గ్రహాల కలయిక జరుగుతోంది.
ఈ కలయికవల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడటంతోపాటు వారికి అంతా సానుకూల ప్రయోజనాలే కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ రాశిలో ఏర్పడుతున్న రాహువు, శుక్రుడి కలయికవల్ల అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి సంపద పెరుగుతుంది.

మీన రాశి: వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రణాళికా బద్దంగా చేస్తున్న కార్యకలాపాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అన్ని పనుల్లోను విజయం సాధిస్తారు. అదే క్రమంలో ఆదాయం కూడా పెరగడంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడటంవల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు.
కన్యారాశి: దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతోపాటు పేరు ప్రతిష్టలు పొందుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారి సంబంధాలు కూడా బలపడతాయి. సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సమయం మొత్తం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పెళ్లికానివారికి ఈ సమయంలోనే పెళ్లి కుదురుతుంది.
కర్కాటకరాశి: సమయాన్ని ఆదా చేసుకుంటారు. అదృష్టం తోడుంటుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధించడంతోపాటు ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలుంటాయి. గొప్ప విజయం మీకోసం ఎదురుచూస్తుంటుంది. కుటుంబ వ్యవహారాల్లో పైచేయిగా ఉండటంతోపాటు మాటకు విలువ దక్కుతుంది.












Click it and Unblock the Notifications