'సారంగ దరియా' పాటకు తేజస్విని ఎనర్జిటిక్ స్టెప్పులు.. వీడియో వైరల్ !
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాగా ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలే కానీ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వలేదు. బాలయ్య ఇద్దరు కూతుళ్లలో ఒక్కరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారేమో అని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది. కానీ పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ ను వివాహం చేసుకోగా.. రెండో కూతురు తేజస్విని కూడా ఎంపీ భరత్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
కాగా ఇటీవల తేజస్విని కొంచెం యాక్టివ్ అయ్యారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించడమే కాదు.. అన్నీ తానై చూసుకుంది. అలానే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది. బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అలానే 'అఖండ 2' చిత్రానికి కూడా సహ నిర్మాతగా చేశారు. తన సోదరుడు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా భాగం కానున్నారని సమాచారం.

వీడియో వైరల్..
కొద్ది రోజుల క్రితం తేజస్వినికి సంబంధించిన ఓ వీడియో సొషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. అందులో కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. ఇప్పుడు మరో డాన్స్ వీడియోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన "లవ్‌స్టోరీ" చిత్రంలోని 'సారంగ దరియా' పాటకు తేజస్విని ఎనర్జిటిక్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో ఆమె స్టెప్పులేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రెండింగ్ గా మారిన ఈ వీడియోను నందమూరి అభిమానులు లైకులు చేస్తూ తెగ షేర్ చేసేస్తున్నారు.
గతంలో కూడా సిద్దార్థ్ ఫైన్ జ్యూవెలరీ సంబంధించిన యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారా అనేలా అనిపించకుండా అదరగొట్టారు. దాంతో తేజస్వినిని చూస్తే హీరోయిన్స్ ఏ మాత్రం తీసిపోరని.. అందమే అసూయ పడేలా ఉందని కామెంట్స్ వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఇలా డాన్స్ వీడియోతో మెస్మరైజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Balayya Daughter Tejaswini Dance Video 💃#NandamuriTejaswini pic.twitter.com/tCkTtKISB4
— Praneeth (@praneethballa) July 12, 2026












Click it and Unblock the Notifications