పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధుడి ఖాతాలో రూ.1500 కోట్లు.. అవాక్కైన అధికారులు!
బీహార్లోని ముజఫర్‌పూర్‌లో ఓ ఊహించని వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం కామేశ్వర్ మిశ్రా అనే 82 ఏళ్ల వృద్ధుడు తన నెలవారీ వృద్ధాప్య పెన్షన్ డబ్బులను తీసుకునేందుకు స్థానిక కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు. ఆయన తన ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్న అనంతరం.. అక్కడ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోగా.. అతని డిజిటల్ ఖాతాలో భారీ మొత్తం నగదు కనిపించింది. అంతా మొత్తాన్ని చూసిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కామేశ్వర్ మిశ్రా బ్యాంకు ఖాతాలో ఉన్నది దాదాపు రూ.759 కోట్ల రూపాయలు. అది గమనించిన వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
రెండు ఖాతాల్లో కలిపి రూ.1,500 కోట్లు
కానీ అది అంతటితో ముగిసిపోలేదు. కామేశ్వర్ మిశ్రా తన పెన్షన్ తీసుకున్న తర్వాత సామాజిక భద్రతా పెన్షన్ స్కీమ్ లబ్ధిదారుడైన తన దివ్యాంగ కుమారుడి ఖాతాను కూడా తనిఖీ చేయించాడు. అక్కడ కూడా దాదాపు అంతే భారీ మొత్తం నగదు ఉన్నట్లు తేలింది. ఈ రెండు ఖాతాల్లోని మొత్తాన్ని కలిపి లెక్కించగా.. రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపించింది. ఈ ఊహించని నగదు మొత్తాన్ని చూసి కామేశ్వర్ మిశ్రా కుటుంబం.. మరోవైపు కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ తీవ్ర గందరగోళానికి గురయ్యారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని సాంకేతిక లోపం కారణంగా ఈ గణాంకాలు స్క్రీన్ పై కనిపిస్తూ ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

అధికారుల వివరణ కోరిన వృద్ధుడు
తన అకౌంట్లోకి అంత భారీ మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో తనకు అస్సలు అర్థం కావడం లేదని కామేశ్వర్ మిశ్రా వెల్లడించారు. దీనికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలని.. బ్యాంకు రికార్డులను పరిశీలించాలని కామేశ్వర్ మిశ్రా స్వయంగా ఉన్నతాధికారులను కోరారు. ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే అధికారులు వాటిని వెంటనే సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని దాచకుండా బహిరంగంగా లేవనెత్తానని కామేశ్వర్ మిశ్రా స్పష్టం చేశారు. అయితే దీనిపై బ్యాంకు అధికారుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు.
7 अरब 59 करोड़,59 लाख रुपए से अधिक है बैंक खाते में फ़िर भी 1100 रुपए हर महीने निकालते है, अपने गुजारा भत्ता के लिए।😯
— Raju verma (@VermarajuRaju) July 12, 2026
जी हां सही सुन रहे है आप ये रामचंद्र वर्मा जी है जिनकी उम्र 75 साल से अधिक है जब ये आधार कार्ड द्वारा अपने खाते से पेंशन के 1100 रुपए निकालने पहुंचे तो जनसेवा… pic.twitter.com/NX4HOLxoFX












Click it and Unblock the Notifications