AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
ఏపీలో సీపీఎస్ ఉద్యోగులకు (AP CPS Employees) కూటమి సర్కార్ ఇవాళ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో తమను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మార్చాలంటూ ఉద్యమాలు కూడా చేసిన ఉద్యోగులకు ఇవాళ ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులుగా ఉన్న వారు పాత విధానంలోకి మారేందుకు వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) కింద ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో.. వారికి వన్ టైమ్ ఆప్షన్ (ఒక్కసారి అవకాశం ) కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెం.53 జారీ చేసింది. దీని ప్రకారం 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జరిగిన నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారిని అర్హులుగా తెలిపారు. ఈ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారే అవకాశం ఇస్తున్నారు.

ఈ జీవో జారీ అయిన తేదీ నుంచి 3 నెలల లోపు అర్హులైన ఉద్యోగులు తమ ఆప్షన్‌ను అధికారులకు సమర్పించాలి. అలాగే ఒకసారి ఓపీఎస్ లేదా సీపీఎస్‌కు సంబంధించి ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్‌ను మార్చుకునే అవకాశం లేదు. దీంతో పాటు గడువులోపు ఎలాంటి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు యథావిధిగా సీపీఎస్ లోనే కొనసాగుతారని కూడా ప్రభుత్వం జీవోలో తెలిపింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా పాత పెన్షన్ పథకంలోకి మారేందుకు ఎదురుచూస్తున్న లక్షల మంది ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications