కూటమి vs వైసీపీ, అసలు పరీక్ష- 2029కి ముందే ఫలితం.. సెమీ ఫైనల్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇప్పటికే 2029 ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. పార్లమెంట్ లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే మరింత వేగంగా వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. అటు జగన్ సైతం ప్రభుత్వం పైన రాజకీయంగా పోరాటానికి సై అంటున్నారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు కూటమి.. వైసీపీ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 25 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తమ పట్ల ప్రజల్లో పూర్తి సానుకూలత ఉందని చెబుతోంది. 2029 ఎన్నికల్లో నూ పొత్తులు కొనసాగుతాయని.. తిరిగి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన గురి పెట్టారు. ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. తిరిగి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని పదే పదే చెబుతున్నారు.

Local Body Elections AP Government likely to conduct in the month of October key directions for NDA leaders

ఈ సమయంలోనే మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొంది.. 2029 ఎన్నికల్లో అమలు చేస్తే.. మొత్తం లెక్కలు మారిపోతాయి. కాగా, సీఎం చంద్రబాబు తాజాగా కీలక అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ - అక్టోబర్ లో ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇందుకు సిద్దం కావాలని సూచించారు.

ఇటు అధికారంలో ఉన్న కూటిమికి... అటు వైసీపీ సమర్థతకు ఈ ఎన్నికలు పరీక్షగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల పైన కీలక హెచ్చరిక చేసారు. ఎక్కడ ఎన్నిక జరిగినా.. పార్టీ అభ్యర్ధి బరిలో ఉండాల్సిందేనని... ఇంఛార్జ్ ఇందుకు బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. పోటీలో ఎక్కడైనా లేకపోవటం.. విత్ డ్రా చేసుకుంటే అందుకు ఇంఛార్జ్ పైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.

అటు కూటమి సైతం తమ రెండున్నారేళ్ల పాలన తరువాత జరిగే ఎన్నికలు కావటంతో ఇప్పటి నుంచే ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ అంతా రంగంలోకి దిగాలని చంద్రబాబు కోరారు. ముందుగా మున్సిపల్, తరువాత దశల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దసరా తరువాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో.. 2029 ఫలితాల పైన మాట్లాడుతున్న కూటమి- వైసీపీకి ఈ ఎన్నికలు సవాల్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+