30ఏళ్ళ తర్వాత 2025లో శని రాహువుల సంయోగంతో వీరికి అఖండ ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పులు, ముఖ్య గ్రహాల సంయోగాలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం శని, రాహువు, కేతువు మరియు గురు గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మార్చి నెలలో మీనరాశిలోకి వెళ్తాడు.
శని రాహువుల సంయోగం
అయితే అప్పటికే అక్కడ ఉన్న రాహువుతో శని సంయోగం చెందుతాడు. 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని రాహువుల అరుదైన కలయిక జరుగుతుంది. ఇది అనేక రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శని, రాహువుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారి పంట పండుతుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
మీనరాశిలో శని, రాహువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి జాతకం నక్కతోక తొక్కినట్టు మారుతుంది. రాహువు మేషరాశిలో 12వ స్థానంలో శనితో కలుస్తాడు. దీంతో వీరు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే కూడా శుభం జరుగుతుంది.ఈ ఏడాది చివరి వరకు మేషరాశి వారికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది. ఇది మేష రాశి వారికి అదృష్ట కాలం.
వృషభరాశి
మీనరాశిలో శని, రాహువుల సంయోగం కారణంగా వృషభరాశి వారికి బాగా లబ్ది జరుగుతుంది. రాహువు వృషభ రాశిలో 12 వ స్థానంలో శనితో కలుస్తాడు. ఈ సంయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు తిరుగు లేని శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారి చిరకాల కోరికలు తీరుతాయి. ఉద్యోగం చేసేవారి పనిలో పురోగతి సాధించి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ధనార్జనా మార్గాలు పెరుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి శని, రాహువుల సంయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. 2025లో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వ్యాపారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఇది తులారాశి వారికి సంపదలను ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications