30ఏళ్ళ తర్వాత దీపావళికి ముందు ఈ అద్భుతయోగంతో వీరింట డబ్బే డబ్బు!
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలు వివిధ రాశులలో ఒక నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. నవగ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తూ కొన్నిసార్లు శుభాలను, మరికొన్నిసార్లు అశుభాలను చేకూరుస్తూ ఉంటాయి. ఇక అక్టోబర్ 11వ తేదీన రెండు ముఖ్యమైన గ్రహాల సంయోగం జరిగింది.
సంసప్తక యోగంతో అదృష్ట రాశులు
శని మరియు శుక్రుడు సంసప్తక యోగాన్ని ఏర్పరిచారు. 30 సంవత్సరాల తర్వాత శని మరియు శుక్రుడు 180 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి ఎదురుగా ఉండటం వల్ల సంసప్తక యోగం ఏర్పడింది. ఈ సంసప్తక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి నేటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
సంసప్తక యోగం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మిధున రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం వరిస్తుంది. వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు.
కుంభరాశి
సంసప్తక యోగం కారణంగా కుంభరాశి జాతకులకు నేటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి. కుంభ రాశి వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుంభరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఇది కుంభ రాశి వారికి అదృష్ట సమయం.
మకర రాశి
నేటి నుండి మకర రాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మకర రాశి జాతకులు కొత్త కెరీర్ అవకాశాలను చూస్తారు. ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications