ఆనందం, ఐశ్వర్యం కావాలంటే..: ఇల్లు ఇలానే ఉండాలి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ రోజు ఇంటి వాస్తు గురించి వివరించారు జ్యోతిష్కులు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయంలో బాత్రూం ఉండరాదు. ఇంటి మధ్యలో బరువు ఉండరాదు. 

ఉత్తర భాగంలోఅరుగులు ఉండరాదు, ఉత్తర సరిహద్దు గోడమీద నిర్మాణాలు కట్టడాలు మెట్లు వంటివి చేయకూడదు.

వంటగది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకొనవలెను. ఇంటికి ఉత్తరంలో ఈశాన్య భాగంలో వీధిపోటు ఉంటే ఐశ్వర్యం ఎక్కువగా వస్తుంది అని ప్రతీతి. తూర్పు భాగంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే మంచిది, ఈశాన్య భాగంలో మెట్లు ఉండాలి పడమరవైపు బాత్రూమ్ ఉండాలి. రాకపోకలకి గాలి వెలుతురులకి ఈశాన్య భాగాన్ని ప్రాధాన్యంగా చూసుకోవాలి.

ఇంటికి ముఖద్వారం ఈశాన్యం గానీ తూర్పు కానీ ఉత్తరం గాని ఉండవచ్చును.ఈశాన్య భాగంలో బోర్వెల్ కానీ బావి గానీ గుంతలు గాని ఉండవచ్చు, దానికి వ్యతిరేక దిశలో అనగా నైరుతి భాగంలో గోతులు గొయ్యి మొదలైనవి ఉండరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మంట పొయ్యి వంటివి ఉంచరాదు.ఈశాన్య భాగంలో కాలకృత్యాలు తీర్చుకునే బాత్రూము ఉన్నా, వాష్ బేసిన్ ఉన్నచొ అన్ని రోగాలకు కారణమవుతుంది.

astrologer tells about about house

లెట్రిన్, బాత్రూములు పశ్చిమం, దక్షిణ ఖాళీ జాగాలో ఏర్పాటు చేసుకొనవచ్చును.ఆగ్నేయ గదిలో ఆగ్నేయ మూలన వంట ఏర్పాటు చేసుకొనవలెను.వాయువ్య భాగంలో నూతులు గోతులు ఉండరాదు ఈశాన్య భాగం వైపుగా వాడుకున్న నీరు బయటికి పోయే లాగా ఏర్పాటు. చేసుకోవాలి

తూర్పు స్థలం తక్కువ ఎత్తులోయుండి ఎక్కువ ఎత్తుగా ఉంటే ధనాభివృద్ధి వంశాభివృద్ధి కలుగును. తూర్పు భాగంలో ఇంటి కన్నాఇంటి గర్భము కన్న తక్కువలోఅరుగులు నిర్మించవలెను.

ఇంటిలో వాడకపు నీరు, వర్షపు నీరు ఈశాన్యం గుండా బయటికి పోవలెను ఈశాన్య భాగంలో డాబా కానీ వేళకాని వెయ్యకూడదు లేదా ఈశాన్య భాగం నుండి పైకి వెళ్ళడానికి మెట్లు గానీ ఉండకూడదు. ఉత్తరాన అవసరమైనప్పుడు మాత్రమే మరుగుదొడ్లు కట్టుకోవాలి.

నిలవ ఉండే వస్తువులు చీపురు మొదలైన విషాన్ని భాగంలో ఉంచుకుంటే ఐశ్వర్యం కదిలి వెళ్ళి పోతుంది. ఈశాన్య స్థలంలో వాస్తు నియమాలు ముఖ్యంగా చూసుకోవాలి.
తూర్పు ఉత్తరం కలుసుకునే చోటును ఈశాన్యం అని అంటారు.

ఈశాన్య భాగంలో ఈశ్వరుడు లేదా పూజామందిరము దేవత స్థానములు పాత్రలో నీరు ఉండడం చేత ఇంటిలో ప్రశాంతత కలుగుతుంది. వాసు శాస్త్రమందు ఈ స్థలమునకు విశిష్ట స్థానము కలదు. అన్ని స్థలముల కన్ననిది ముఖ్యమైనదిగా నిర్ణయింపబడినది.ఇంటికి బయట కాని లోపల కానీ గుంట లేదా బావి ఉంటే స్థిరమైన ధనాదాయం ఉంటుంది.

ఉత్తరం గానీ ఈ శాన్యం గానీ తక్కువ ఎత్తులో ఉంటే ఆ ఇంటిలో ఇల్లరికపు అల్లుడు ఉంటారు. ఈశాన్య భాగం పాడైపోతే ఆ ఇంటిలో యజమాని ఇంటికి దూరంగా ఉంటాడు. ఇంటికి పైన దాబా మొదలైన కట్టడాలు కట్టాలనుకుంటే ఇతరమైన ఏదైనా ప్రాంతములలో కట్టుకోవాలి కానీ ఈ శాన్యం వైపు వెళ్లకూడదు.

భూమి పూజ, వాస్తు పూజ ఎలా చేస్తారు ? ఎందుకు చేస్తారు?
భూమిమీద స్మశానం కానీ చోటు అంటూ ఏదీ లేదు. మనం ఏ చోట ఉండాలనుకున్నా ఒకానొకప్పుడు ఆ చోట ఒక శరీరము లేదా ప్రాణము విడవబడ్డ ది మాత్రమే అయి ఉంటుంది. భూమికి మూడు రకముల దోషములు ఉంటాయి. స్పర్శాదోష, దృష్టి దోషం, శాల్యా దోషం స్పర్శాదోషం అనగా ముట్టుకుంటే వచ్చే కొన్ని రకముల క్రిమి కీటకముల వల్ల వచ్చే దోషము.

దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల వచ్చే దోషము. మృత్యు దోషము లేదా శాల్యా దోషము అనగా మరణించిన శరీరము యొక్క అవశేషాలు ఉన్నా, చనిపోయిన చోటుగా ఉన్న ఆ చోట దేవతావాహనం జరగదు. కాబట్టి అటువంటి చోట పవిత్రతను పెంచడానికి శంకువును స్థాపిస్తారు దానిని భూమి పూజ లేదా వాస్తు పూజ అంటారు .

కాబట్టి ఆ చోట పవిత్రతను పెంచడం మళ్లీ పంచభూతాలతో నిర్మితమైనా శరీరం లాంటి ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నాను కాబట్టి దానిలో ప్రాథమికమైన ప్రాణాన్ని నిలిపే ప్రక్రియను భూమి పూజ లేదా శంకుస్థాపన లేదా వాస్తు పూజ అని అంటారు.
పూజ చేసే విధానము

ముందుగా యజమాని లేదా భూమి ఉన్న వ్యక్తి వారి పేరున యోగ్యమైనది మంచి ముహుర్తముని చూసుకోవాలి. తరువాత పురోహితుడు సహాయంతో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదటి పూజ గణపతి పూజ ఆటంకములు విఘ్నములు తొలిగి ఇల్లు సుభిక్షంగా ఉండాలని చేసే పూజ.

రెండవది పుణ్యాహవాచనము అన్ని రకముల మాలిన్యములు తొలగించి పవిత్రతను కలిగించే పూజగా పుణ్యాహవచనం ని చేస్తారు. మూడవది సూర్యుడు మొదలైన తొమ్మిది మంది గ్రహములను పూజిస్తారు దీనివల్ల గ్రహదోషములు పోతాయి.నాలుగవది వాస్తు పూజ శంకు పూజ చెక్కతో చేయబడినటువంటి శంఖానికి జనపనార చుట్టి రత్నముల చేత పొదిగి షోడశోపచారములు చేత పూజిస్తారు. ఈ శంఖాన్ని తీసుకొని కట్టడానికి ఈశాన్య భాగంలో భూమిలోపల స్థాపన చేసి పూజించి పూడ్చి వేస్తారు. దీనినే వాస్తు పూజ, అనే పేర్లతో పిలుస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about arrangements of house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి