దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఉంగరంలో ఏ రత్నమును ధరిస్తే ఏయే ఫలితాలిస్తాయంటే?

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: జ్యోతిష్కులు ఏయే ఉంగరాలకు ఏయే రత్నాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయనే అంశంపై స్పష్టంగా వివరించారు.

   Weekly Horoscope 29-10-2017 To 4-11-2017 రాశి ఫలాలు 29-10-2017 నుండి 4-11-2017 | Oneindia Telugu

   కెంపు:
   ఇది సూర్యునికి ప్రీతికరం పడే రత్నం. ఈ రత్నాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించడం లేదా మధ్య వేలికి ధరించవచ్చు. ఈ ఈ రత్నాన్ని బంగారం లేదా వెండిలో ధరించడానికి కుదురుతుంది. ఆదివారంసూర్యహోరలో ఈ ఉంగరాన్ని ధరించాలి.

   ఉంగరాన్ని ధరించేముందు
   జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
   తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
   అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   దీన్ని ధరించడం వల్ల కలిగే వంటి ప్రయోజనాలు
   శరీరానికి వచ్చేటువంటి తాపము కోపము మొదలైనవి నివృత్తి చేయబడతాయి, జాతకంలో ఉద్యోగానికి ప్రతికూలతలు ఉంటే తగ్గ బడతాయి, అధికారులు అనుకూలం గా మారుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్లకు జాతకాన్ని బట్టి ఏ రత్నాన్ని ధరిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.

   ముత్యము:
   ఆల్చిప్పల దొరికేటటువంటి ఒక పదార్థం ఇది. మనస్సు మీద చాలా విశేషమైన ప్రభావం చూపించే చంద్రగ్రహ ప్రీతికరమైనది ముత్యము. అయితే ఈ రత్నాన్ని బంగారం లేదా వెండిలో ధరించవచ్చు. సోమవారం ధరించడం ప్రశస్తమైనది.

   astrologer tells about rings and Gems

   ఈ ఉంగరాన్ని ధరించేముందు
   దధిశంఖ తుషారాభం ! క్షీరోదార్ణవ సంభవం
   నమామి నశినం సోమం ! శంభోర్మకుటభూషణమ్ !! శ్లోకాన్ని అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   దీన్ని ధరించడం వల్ల చపల బుద్ధి మానసిక ఆందోళన జలుబు వంటి శరీర రోగాలు పోవడమే కాక అక్కా చెల్లెళ్లతో తల్లిదండ్రులతో మంచి సంబంధాలు పెరుగుతాయి. పిల్లలకు ముత్యాన్ని ధరింపజేయడం వల్ల మన మాట వినే విధంగా కొంత జరుగుతుంది.

   పగడము:
   ఇది సముద్రంలో దొరికే ఒకానొక శిలీంద్రము వంటిది. అంగారక గ్రహ ప్రీతికరమైన పగడాన్ని శరీరంలో దండా లేదా ఉంగరం రూపంలో ధరించవచ్చు వెండి అయినా సరిపోతుంది.

   ఈ ఉంగరాన్ని ధరించేముందు....
   ధరణీ గర్భ సంభూతం ! విద్యుత్కాంతి సమ ప్రభం
   కుమారం శక్తి హస్తం తం ! మంగళం ప్రణమామ్యహమ్ !! అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   దీన్ని ధరించడం వల్ల రక్తహీనత ఎముకల బలహీనత తొలగిపోతుంది కోపము నివారించబడుతుంది. శరీర సంబంధమైన అనేక రుగ్మతలను నివారిస్తుంది. మర్యాదగా అధికరులతో అనుకూలతను కూడా కలిగిస్తుంది.

   పచ్చ లేదా మరకతం:
   ఇది భూమిలో జన్మించే ఒక ఆకు పచ్చ రంగు రత్నం. ఇది బుధగ్రహానికి ప్రీతికరమైనది ఇది బంగారంలో ధరించడం విశేషం. దీన్ని ధరించడానికి ముందు...
   ప్రియంగుకలికా శ్యామం ! రూపేణా ప్రతిమం బుధం
   సౌమ్యం సత్త్వగుణోపేతం ! తం బుధం ప్రణమామ్యహమ్ !! ...అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   మరకతం ధరించడం వల్ల ఫలితాలు
   కుటుంబంలో బంధువులతో ఉండే గొడవలు తగ్గుతాయి, నరాల బలహీనత నియమించ బడుతుంది, వ్యాపారంలో సత్సంబంధాలే ఏర్పడతాయి.

   పుష్యరాగము:
   ఇది తవ్వకాల్లో దొరికే ఒకానొక పసుపురంగు మెరిసే రత్నము. ఇది గురుగ్రహానికి ప్రతీకగా చెప్పబడుతుంది.
   గురు గ్రహ దోషాలున్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే చాలావరకు నియంత్రించబడుతుంది. ఈ రత్నాన్ని ధరించే ముందు
   దేవానాం చ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం
   బుద్ధిమంత్రం త్రిలోకేశం ! తం నమామి బృహస్పతిమ్ !! అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.
   దీన్ని ధరించడం వల్ల పుత్ర దోషం పోతుంది శరీరంలో షుగర్ వంటి రోగాలు తగ్గుతాయి. అధ్యాత్మ భావనలు పెరగడమే కాకుండా శరీరంలో కాంతి వస్తుంది. మనసు ప్రశాంతంగా పవిత్రం గా ఉండటానికి సహకరిస్తుంది.

   వజ్రము:
   ఖరీదైన రత్నంలో ఇది మొదటిది. ఈ రత్నము శుక్రగ్రహానికి ప్రతీక. శుక్ర గ్రహ దోషం ఉన్న వాళ్ళు బంగారముతో ఎడమచేతికి ధరించవచ్చు.

   ఈ రత్నాన్ని ధరించే ముందు...
   హిమకుంద మృణాళాభం ! దైత్యానాం పరమం గురుం
   సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!... అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   వజ్రాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
   శుక్రుడు బలహీనంగా ఉన్నవాళ్లు ఎడమచేతికి అనుకూలత కావాలనుకున్నవాళ్లు కుడిచేతికి ధరించడం వల్ల హార్మోనల్ సమస్య తగ్గుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది సంతాన ఉత్పత్తి పెరుగుతుంది. శరీరంలో అందం ఏర్పడుతుంది. శుక్ర సంబంధమైన అనేక ఫలితాలు పొందడానికి ఇది ఉపకరిస్తుంది.

   ఇంద్రనీలము:
   నీలం రంగులో ఉండే ఈ రత్నానికి అధిపతి శని గ్రహం. శనిగ్రహం బలహీనంగా ఉన్నవాళ్లు చెడు ప్రభావాలు ఉన్నవాళ్లు దశ నడుస్తున్నవారు శని అనుగ్రహం పొందడం కోసం గా ఈ రత్నాన్ని ధరిస్తారు. ఈ రచనని వెండిలో ధరించి ఎడమ చేతికి ధరించడం వల్ల తొందరగా ఫలితాలను పొందుతారు.

   ఈ రత్నాన్ని ధరించే ముందు....
   నీలాంజన సమాభాసం ! రవిపుత్రం యమాగ్రజం
   ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరమ్ !! .అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   దీన్ని ధరించడం వల్ల కలిగే వంటి ప్రయోజనాలు
   నీలాన్ని ధరిస్తే జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి శనిపీడ పోతుంది చర్మ సంబంధమైన రుగ్మతలు పోతాయి. పైల్స్ వంటి పెద్దపెద్ద రోగాలు తగ్గుముఖం పడతాయి.

   గోమేధికము:
   ఇది రాహువుకు ప్రీతియైన రత్నము. ఈ రత్నాన్ని ధరించడం వల్ల రాహు సంబంధమైన దోషాలన్నీ పరిహరించబడతాయి. ఈ రత్నాన్ని ధరించే ముందు...
   అర్ధకాయం మహావీరం ! చంద్రాదిత్య విమర్దనం
   సింహికా గర్భసంభూతం ! తం రాహుం ప్రణమామ్యహమ్ !!.అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.
   ఈ రత్నాన్ని ధరించడం వల్ల కంటి సంబంధ మైన రోగాలు తగ్గుతాయి మృత్యు సంబంధమైన, భయం తగ్గుతుంది శరీరంలో బలం పెరుగుతుంది.

   వైడూర్యము:
   ఇది కేతువుకు వీధి అయిన రచనము దీని ధరించడం వల్ల కేత సంబంధమైన అన్ని దోషాలు పోవటమే కాక భక్తి జ్ఞాన వైరాగ్యములు పెరుగుతాయి. దీన్ని
   ధరించేముందు......
   ఫలాశ పుష్ప సంకాశం ! తారకా గ్రహ మస్తకం
   రౌద్రం రౌద్రత్మకం ఘోరం ! తం కేతు ప్రణమామ్యహమ్ !!.....అనే శ్లోకాన్ని తక్కువలో తక్కువ వెయ్యి సార్లు జపించి ధారపోసిన నీళ్ళని ఉంగరం మీద పోసి పంచామృతం చేత కడిగి పసుపు కుంకుమల చేత పూజించి ఉంగరాన్ని ధరించాలి.

   English summary
   Astrologer described about wearing of rings and gems results.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more