వివాహం కావడం లేదా బహుశా ఈ దోషాలు కావచ్చు పరిహారం చేసుకోవాలి.?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జ్యోతిస్కులు ఈ రోజు పలు అంశాలపై సవివరమైన సమాధానాలను అందించారు. వాటిలో..

1. ఉద్యోగులు ధ్యానం చేయవచ్చా ఒకవేళ చేస్తే ఎలా చేయాలి?
నిత్య జీవితంలో అందరూ ధ్యానం చేయాలి. మనసుని నిగ్రహించుకో దానికి మనం ఒక పెద్ద సాధకం. మన యోగులు కాకుండా అందరూ చేయవచ్చు. మంత్రాల దేశాలతో దీనికి సంబంధంలేదు. తమ ఇష్ట దైవం యొక్క నామాన్ని కూర్చున్న చోటే పాదరక్షలు విడిచి ధ్యానం చేయాలి.

  Daily Horoscope Telugu దిన ఫలాలు 30-10-2017

  2. దానధర్మాలను బ్రాహ్మణులకే చేయాలా ఎవరికైనా చేయవచ్చా?
  దానం ఎవరికి చేస్తున్నామనే దానికంటే వినియోగించుకునే వారికి సరైన వస్తువులు దానం చేస్తున్నామా లేదా అనేది ముఖ్యంగా గమనించాలి. ఎవరి శక్తి కొద్దీ వారు కలిగిన దాంట్లో దానం చేయాలి. దేవాలయానికి దానం చేయవచ్చు, బ్రాహ్మణులకు దానం చేయవచ్చు, అనాధల వారికి ముసలి వారికి దానం చేయవచ్చు ఇవన్నీ పుణ్యము నిచ్చే పనులే.

  ఉదాహరణకి ఒక గ్రహ ప్రతీకగా దానం చెయ్యాల్సి వస్తే ఆ గ్రహానికి సంబంధించిన వస్త్రములు ధాన్యము బ్రాహ్మణునికి దానం చేయవచ్చు, పిండివంటలు పదార్థాలు మొదలైనవి అనుకునేవారికి ఆకలికి దానం చేయవచ్చు మరికొన్నింటిని అనాధాశ్రమాలు మొదలైనవాటిల్లో దానం చేయవచ్చు.

  astrologer tells about some normal doubts

  3. గరుడ పురాణం ఇంట్లో ఉంచకూడదని నిజమేనా అన్ని సందర్భాల్లో చదవకూడదా?
  ఇది ఎక్కడా రాసి లేదు. ఏ పుస్తకమైనా ఇంట్లో ఉంచవచ్చు అని చెప్పారు. 18 పురాణాలలో ఒకటైనప్పుడు అన్నింటికీ విలువ ఉంటుంది కదా. ఎవరైనా మరణించినప్పుడు పేరు నిలిచిపోయింది. ఆ సందర్భంలో తప్పకుండా చదువుతారు కాబట్టి ఇది పితృ కర్మలలో మాత్రమే చదివేది అని ఒక పేరు నిలిచిపోయింది. అంతేతప్ప ఎప్పుడైనా ఎవరైనా చదవచ్చు. అందులో మనకు తెలియ వలసిన విషయాలు అనేకములు ఉన్నాయి. గరుడ పురాణం ఉన్నచోట ఐశ్వర్యము ఉంటుందని చెప్పడం జరుగుతుంది.

  4. వివాహం కావడం లేదా బహుశా ఈ దోషాలు కావచ్చు పరిహారం చేసుకోవాలి.?
  కలియుగంలో వివాహం కాకపోవడానికి అనేకమైన కారణాలున్నాయి కుజదోషం మాంగల్య దోషం నాగ దోషం కాలసర్ప దోషం అని కొన్ని ఉన్నాయి.
  వివాహం ఆలస్యంగా కావడం, లేదా అనుకూలమైన జీవిత భాగస్వామి దొరకకపోవడం, లేకపోతే వివాహమైన విడిపోవడం అంటే జరుగుతున్నాయి. ఆయా దేశాలకు సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చూద్దాం.

  కుజదోషం
  కుజదోషం ఉన్నవారు పగడాలను ధరించాలని కొందరు చెబుతారు కానీ మరికొందరు ఒప్పుకోరు. మరికొన్ని గ్రంథాలు కుజ దోషం కలిగినవారు పగడాన్ని ఎడమచేతికి ధరించడం వల్ల దేశం వహించబడుతుంది చెప్పారు.
  మంగళవారం రోజు నాడు దుర్గాపూజ చేయడం కుంకుమార్చన చేయడం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం మంచిది
  మంగళవారం గానే శుక్రవారం గానీ సాయంకాలం దక్షిణ దిక్కుగా దీపం పెట్టి దుర్గా స్తోత్రం పఠిస్తే కుజ దోషం తగ్గుతుంది.
  ఆడపిల్లలు ప్రతి నెలలో వారి జన్మ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించాలి.
  మంగళవారం గౌరీ దేవిని పూజించిన కారం వస్తువులు దానం చేసినా విశేషమైన ఫలితంగా వివాహ దోషం పోతుంది.

  నాగదోషం
  జాతకరీత్యా రాహు కేతువుల మధ్య మిగిలిన కథలు ఇరుక్కుపోవడం కాలసర్ప దోషం అని నాగదోషమని చెప్పారు.
  ఇలా దోషం కలిగినటువంటి వారు వివాహంలో విషయంలో గట్టి బెట్టు చేయడం లేదా అనుకూలమైన భార్య లేదా భర్త దొరక్క పోవడం జరుగుతుంది.వారు చేయవలసిన కొన్ని పరిహారాలు.

  కాలసర్పదోషం గనుక ఉన్నట్లయితే కాళహస్తిలో ఒక రోజు నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం సామూహికంగా జరిగాయి పాము పడగ నిదానంగా ఇవ్వాలి.
  ప్రతి నెలలో చవితి రోజు గానీ పంచమి రోజున కానీ నాగేంద్ర స్వామి కి పాలను దానంగా నైవేద్యంగా సమర్పించాలి.
  పాము పుట్టకు ప్రదక్షిణ చేసిన కూడా ఈ దోషం పోతుంది.
  సుబ్రహ్మణ్యస్వామి సర్ప రూపంలో పూజించిన కూడా నాగదోషం పంచబడుతుంది.

  5. పరమేశ్వరుని శివలింగంలోనే ఎందుకు పూజిస్తారు?
  పరమేశ్వరుడు లింగరూపం ని పూజించాలి విగ్రహంగా పూజించకూడదు ప్రత్యేకంగాపటాలతో పూజించకూడదు.ఒకప్పుడు ఋషులందరూకలిసి దీర్ఘ సత్రయాగం చేశారు అని దాన్ని స్వీకరించడానికి ఉన్నతమైన దైవం కావాలని ఎవరు ఉన్నతుడు అనేది పరీక్షించడానికి మనుషులందరూ కలిసి భృగువును పంపించారు. అలా బయలుదేరిన బరువు ముగ్గురు మూర్తులు అయిన బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు లోకములలో కి వెళ్ళి దేవతలను పరీక్షించి ఎవరు ఉన్నతుడు తేల్చుకుందామని వెళ్లాడు. అయితే అందులో భాగంగా ఈశ్వరుడు నిర్లక్ష్యం చేసిన కారణంగా భ్రుగు అనే మహర్షి లింగ రూపమై పాషాణ రూపంలో పూజింపబడతాడని శపించాడట. అప్పటినుంచి పరమేశ్వరుడికి లింగరూపం ప్రమాణికమైనవి. శివలింగాలలో అనేకమైన లింగాలు ఉండటం విశేషం అందం ఆ మట్టి లింగము, సాలిగ్రామ లింగములు కలియుగంలో వేగమైన ఫలితాన్నిస్తాయి.

  6. తలంటుకుని స్నానం చేయకూడని రోజు ఏది?
  నిజానికి తలంటుకోవడం వల్ల తలలో శరీరంలో ఉండే మురికంతా కూడా పోతుంది. కొన్ని తిధులయందు కొన్ని రోజులలో గనక చేస్తే మురికి తో పాటు ఐశ్వర్యం కూడా పోతుంది. అభ్యర్థనను అంటే తలకి ఒంటికి నూని రాసుకుని కుంకుడుకాయ తో స్నానం చేయడం అభ్యంగనం అంటారు. మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య రోజులలో ప్రత్యేకించి తలంటుకోవడం మంచిది కాదు. బుధవారంనాడు తలంటుకుంటే మంచిది సోమవారంనాడు మరీ మంచిది అని శాస్త్ర వాక్యం.

  7. భారతీయ ధర్మ శాస్త్రంలో నిద్రా నియమాలు ఏవి ?
  శాస్త్రం ప్రకారం తూర్పు దిశ తలను పెట్టకూడదు దక్షణ దిశలో తలపెట్టి పడుకోవడం అన్ని విధాల మంచిది.
  ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచం మీద వెల్లకిలా లేదా పక్క వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఇద్దరికీ కూడా సుఖంగా పని చేస్తుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Astrologer clarified some normal doubts of peoples on some issues.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి