వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయకచవితి నవరాత్రులలో చేయకూడనివి, చెయ్యవలసినవి

ఈ సంవత్సరం తిథి ప్రకారం 25వతేదీ శుక్రవారం రాత్రి 9గంటల వరకూ చవితి ఉంది కనుక. సూర్యా స్తమయం 6.05కి అవుతుమది సూర్యాస్తమయం లోపుగానే స్థాపన చేయాలి.పూజమీద కూర్చునేవారు ఏరోజున కూర్చున్నా సంప్రదాయ దుస్తుల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ సంవత్సరం తిథి ప్రకారం 25వతేదీ శుక్రవారం రాత్రి 9గంటల వరకూ చవితి ఉంది కనుక. సూర్యా స్తమయం 6.05కి అవుతుమది సూర్యాస్తమయం లోపుగానే స్థాపన చేయాలి.

పూజమీద కూర్చునేవారు ఏరోజున కూర్చున్నా సంప్రదాయ దుస్తుల్లోనే కూర్చోవాలి.
మూడు రోజులు ఉంచేవారు మూడు రాత్రులు 5,6,7 లు పూర్తి చేసి. 8ఉదయాన్నే తీయాలి కానీ 7వతేదీ రాత్రి తీయరాదు.
5రోజులు ఉంచేవారు 5-9 వరకు ఉంచాలి బుధవారము రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.
7 రోజులు ఉంచేవారు 5-11 వరకు ఉంచాలి గురు వారం రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.
9 రోజులు ఉంచేవారు 5-13 వరకు ఉంచాలి ఆదివారం రోజున ఉదయం ఉద్వాసన చేయాలి.
11 రోజులు ఉంచేవారు 5-15 వరకు ఉంచాలి సెప్టెంబర్ 4న లేదా 6న నిమజ్జనం చేయాలి. ఎందుకంటే 5న మంగళవారం అవుతుంది కనుక.

Astrologer described about Vinayaka chaturthi arrangements.

ఉద్వాసన చేసేటపుడు ఒకటి. వాహనమ కదిలేటపుటు మరొకటి గుమ్మడి కాయని కొట్టాలి.
.సామూహుక కుంకుమార్చనలు చేసుకోదలచినవారు 29 మంగళవారం,1వ తేదీ శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లలితా సహస్ర నామాలతో చేసుకోండి.

. చదువుకునే పిల్లలతో సామూహిక గరిక పూజ 27వతేదీ ఉదయాన చేయించండి. ఇవి నియమాలు.
'' యత్‌ శాస్త్ర విధి ముత్‌సృజ్య వర్తతే కామకారత:
నససిద్ధి మవాప్నోతి నసుఖం, నపరాంగతిమ్‌ .'' అని భగవద్గీతా శ్లోకం.

అంటే శాస్త్ర విధిప్రకారం నియమాలు పాటించనివారికి, అలా నడుచుకోనివారికి చేసేపనికి ఫలితమూరాదు, స్వర్గాది పుణ్యలోకాలు పొందకుండా, నరకానికి వెళతారు అని ఈశ్లోకార్థం.

కాబట్టి చక్కగా నియమంగా స్వామిని పూజించి ఐహికాముష్మికాలు తీర్చుకోవాలని కోరుకుంటూ.. తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు చేస్తున్నాము. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.

మట్టి వినాయకుడు మాత్రమే చేయాలి రసాయనాలతో చేసిన విగ్రహాలు ప్రకృతికి దైవానికి కూడా ద్రోహాన్ని కోపాన్ని కలిగిస్తాయి శాస్త్ర ప్రకారం వినాయకుడి మూర్తి మట్టితో మాత్రమే రంగులు లేకుండా తయారుచేసి పూజించాలి వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని ఇలా ఎందుకు పూజిస్తున్నారు. '' ఫిధ గణపతి, గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్ గణపతి బుల్లెట్ గణపతి ...ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు ఎందుకు ఇవి కృత్యాలు ..?

కాలని లోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్లి తండ్రులు, నాయకులు ఇలాంటివి చూసి కూడా నోరు మెదపడం లేదు.. ప్రోత్సహిస్తున్నారు . బుద్ధి రాను రాను వక్రీకరించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మనకంటే ఇతర మతాల వారు చాలా ఉత్తమం. వాళ్ళు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు.

తర్వాతి విషయం మైకులు పెట్టడం
నవరాత్రులు జరిపే చోట శుచి శుభ్రత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఉండడం వల్ల ద్వారా కాలుష్యం చేయడం తప్పు వీలయితే మైకులు లేకుండా భజనలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది. ఇక నవరాత్రులు చివరి రోజు మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు , భయకరమైన సౌండ్ సిస్టం , ఇలా ప్రతీది తప్పే అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు. మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదికాదు? ఒక్కసారి ఆలోచించండి.

మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి.
వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి.

ఎక్కడ పెట్టకూడదు
మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే .
చాలా జాగ్రత్తగా గమనించండి....1 మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యం పెరిగినట్లు .
దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మనమే కావాలి. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కతిని కాపాడే బాధ్యత మనలో లేకపోతే పాపమే.

English summary
Astrologer described about Vinayaka chaturthi arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X