భక్త హనుమన్‌కు ఇలా చేస్తే అన్నీ శుభాలే

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. రామ భక్తున్ని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి,చల్లని నీటితో తల స్నానం చేసి నిష్ఠతో శుచిగా ఇంటిని,పూజాగదిని శుభ్రం చేసుకోవాలి.ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.ఆంజనేయ స్వామి పూజ కోరకు బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమలపాకులు మొదలగు పూజా సామగ్రిని సమకూర్చుకొని దీపారాధన చేసి ఎర్రని పువ్వులు అలంకరణకు ఉపయోగించి పూజించాలి.

అంజని పుత్రునికి నైవేద్యంగా అరటి పండ్లు, శనగలతో చేసిన గుగ్గిళ్లు, నేతితో చేసిన తీపి పదార్థాలు,108 తమలపాకులతో మాల వేయాలి.లేదా జిల్లేడు పూల మాల,వడమాలను కూడా స్వామి వారికి అలంకరించవచ్చును. ముఖ్యంగా వడమాల,బెల్లం,నేతితో చేసిన తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

రామభక్తునికి నివేదన చేసిన ప్రసాదాన్నిఆ తర్వాత పేదలకు,భక్తులకు పంచి పెట్టాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉప్పు,కారం తక్కువగా ఉన్న సాత్విక పదార్థాలను మాత్రమే తినాలి. నేల మీద చాప వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితోనైన ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తూ ఆత్మీయంగా పలకరించాలి.పరిహాసాలు,పౌరుషమైన మాటలను ఎంత మాత్రం చేయకూడదు.

Astrology:How to pray hanuman

ఒకటే పూట భోజనం చేసి 41 వారాల పాటు మంగళవారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో స్వామిపై మనస్సును కేంద్రీకరించి పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడి వ్రతం వలన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, గ్రహ భాదలు తోలగి ధైర్యం చేకూరుతుంది,ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి,ఐశ్వర్యం,సమాజంలో గౌరవం,సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు.మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది,ఉపాధి అవకాశాలు చేకూరుతాయి,ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయి.

భక్తాంజనేయున్నిశనివారం రోజు పూజిస్తే శని గ్రహదోషాలు తొలగిపోతాయి.ప్రతి నిత్యం పూజించి స్మరిస్తే శనిభాదలు ఇబ్బందులు పెట్టవు.ఆంజనేయుడిని శ్రీరామనామ శబ్దం తో ఎవరైతే నిరంతరం స్మరిస్తుంటారో ఆ రామ నామ శబ్ధం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమౌతాడని పురాణాల ద్వార తెలుస్తుంది.స్వామికి తన భక్తులలో వినయ విధేయతలతో ధర్మబద్ధంగా ఉండే వారంటే చాలా ఇష్టం.ముఖ్యంగా ఈ ఆంజనేయున్ని పూజించి ఊరికే ఉండకుండా తమ తమ సామర్ధ్యాలకు తగిన జీవనోపాదికొరకై కృషి చేసిన వారికే శుభఫలితాలు ఇస్తాడు.కేవలం పూజలు,వ్రతాలు, దీక్షలు,చేసి ఫలితం ఆశిస్తే లాభం ఉండదు. ఆంజనేయుడు"కష్టే ఫలే"సిద్దాంతాన్ని ఇష్టపడుతాడు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu astrologer Chary explains the method of Hanuman puja for well being.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి