astrology: కుడికన్ను కొట్టుకుంటే వారికి అరిష్టమా? కళ్ళు కొట్టుకోవటంలో మంచి చెడు శకునాలు
జ్యోతిష్య శాస్త్రంలో శకునాలు భవిష్యత్తును సూచిస్తాయని చాలా మంది నమ్ముతారు. శకునాలు మార్పును సూచించే సంకేతాలు గా పరిగణించబడతాయి. ఇక వీటిలో మంచి శకునాలు, అపశకునాలు కూడా ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో భాగమైన శకునాల అధ్యయనం అనేక కీలక విషయాలను వెల్లడిస్తోంది. చాలా మంది ఋషులు మరియు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భవిష్యత్తులో జరగనున్న ఒక సంఘటనకు దారితీసే కారణాలను విశ్లేషించడానికి, మరియు వివరించడానికి శకునాలను ఒక సాధనంగా చూస్తారు.

నేటికీ శకునాలను పాటిస్తున్న భారతీయులు
మన ఇళ్ళలో పిల్లి ఎదురొస్తే దుస్సంకేతం అని, బయటకు వెళ్తున్న సమయంలో ఎవరైనా తుమ్మితే దుశ్శకునం అని, అలాగే భర్త చనిపోయిన మహిళ ఎదురుపడినా దుస్సంకేతమని ఇప్పటికీ పాటించే వారు లేకపోలేదు. ఇక కుక్కలు ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందని, ఇంట్లోకి గబ్బిలం వచ్చినా అరిష్టం జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అరిష్టం అని, మగవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం అని చెప్తారు. ఇక శకునాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.

కళ్ళు కొట్టుకోవటం భవిష్యత్ కు ముఖ్యమైన సంకేతాలు
భారతీయ సంస్కృతిలో కళ్ళు కొట్టుకోవడం ఒక ముఖ్యమైన సంకేతంగా పరిగణించబడుతుంది. కుడి కన్ను అదిరితే ఒక అర్థం, ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్ముతారు. స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం అదృష్టాన్ని తెస్తుందని పరిగణిస్తారు. మహిళలకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని, ఊహించని అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.

స్త్రీలకు కుడికన్ను కొట్టుకోవటం మంచిది కాదు
స్త్రీలకు కుడి కన్ను కొట్టుకోవడం మంచిది కాదని సూచించబడింది. ఒకవేళ స్త్రీలకు కుడి కన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని, దురదృష్టమని చెప్పబడింది. మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెబుతున్నారు. ఈ శకునం మహిళలకి అష్ట దరిద్రాలు తెచ్చి పెడుతుంది. ఇక పురుషుల విషయంలో ఇది వ్యతిరేకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

పురుషులకు ఎడమకన్ను కొట్టుకోవటం మంచిది కాదు
పురుషులకు కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని చెబుతారు. సంపద వస్తుందని చెప్పటానికి సూచనగా దీనిని పరిగనిస్తారు. అదే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టము రాబోతుందని సూచన అని పేర్కొన్నారు. ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications