astrology predictions 2023: కుంభరాశి వారికి ఆర్ధికంగా లాభదాయకం; వారిని వేధించనున్న సమస్య ఇదే!!
2023 సంవత్సరంలో కుంభ రాశి వారికి జాతకం ఎలా ఉంది? వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా? కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కుంభరాశి జాతకులపై శని ప్రభావం.. ఫలితాలు ఇలా
కుంభ రాశి వారికి 2023 సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం కుంభ రాశి వారిపై శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక శనీశ్వరుడి సంచారం కారణంగా అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభఫలితాలను కూడా పొందుతారు. అనేక పనులలో విజయాలను సాధిస్తారు. కుంభ రాశి జాతకులకు జనవరి నెల శారీరకంగా బలహీనంగా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. కాస్త ఖర్చులు పెరిగి, మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం వేధించే సమస్య
కుంభ రాశి జాతకులకు ఫిబ్రవరి నెల వైవాహిక జీవితంలో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో కుంభ రాశి జాతకులకు వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. ఇక మార్చి లో అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ విజయవంతం చేస్తారు. గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు. కానీ మార్చి నెలలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. అందుకే మార్చి నెల నుండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఇక విద్యార్థులు విద్యాపరమైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు, కొంత ఆందోళనకు గురవుతారు. ఏప్రిల్ నెలలో కూడా కుంభ రాశి జాతకులు ఒత్తిడిని, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరమైన నష్టాలను కూడా చూడవలసి వస్తుంది.

ఒక నెల సంతోషం.. ఒక నెల సమస్యల వలయంలా 2023
మే నెలలో కుంభ రాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే మంచిదని సలహా ఇవ్వబడింది. మే నెలలో కోర్టులో ఉన్న కేసులలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన కొన్ని చిక్కులు తొలగిపోతాయి. విరోధులను ఓడించి విజయం సాధిస్తారు. ఇక జూన్ నెలలో కుంభ రాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహేతర సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తుంది. జులై నెలలో కుంభ రాశి జాతకులకు అనుకూలంగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. జులై నెలలో జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి . వ్యాపార సమస్యలు కూడా చిరాకు తెప్పిస్తాయి.

ఈ నెలలో జాగ్రత్త అవసరం
ఇక ఆగస్టు నెలలో కుటుంబ కలహాలు కొంతమేరకు తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి, సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. సెప్టెంబర్ నెలలో కుంభ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. అక్టోబర్ నెలలో కుంభ రాశి జాతకులకు కాస్త సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి మెరుగైన విద్య ఫలితాలు అందుతాయి.

సంవత్సరం చివరలో మంచి ఫలితాలు
నవంబర్ నెలలో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండడంతో సంతోషాన్ని పొందుతారు. వృత్తిపరమైన, వ్యాపార పరమైన ఒత్తిడులు కూడా తగ్గుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. డిసెంబర్ నెలలో కుంభ రాశి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులను కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలోనూ ప్రశాంతత కనిపిస్తుంది.

అంతా ఓకే కానీ ఆ విషయంలోనే జాగ్రత్త
ఇక కుంభ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి సంవత్సరంగా 2023 ను చెప్పవచ్చు. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరం కుంభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. ఇక వివాహం చేసుకోవాలనుకునే కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరం మంచి సంవత్సరం గా చెప్పబడింది. వారు వివాహం చేసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా కుంభ రాశి జాతకులు ఈ సంవత్సరం కుంభ రాశిలో చంద్రుడు, శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. కచ్చితంగా ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే కుంభ రాశి జాతకులకు 2023 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications