మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు మహర్దశ
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతుంటాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో చంద్రుడు, కుజుడు కలుసుకోనున్నారు. కుంభరాశిలో ఈ కలయిక ఉంటుంది. 18వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తారు. ప్రస్తుతం కుజుడు అదే రాశిలో ఉన్నాడు. చంద్రుడి ప్రవేశంతో ఇద్దరూ కలిసి సంయోగం చెందడంతో మహాలక్ష్మీ రాజయోగం, త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతున్నాయి.
మేషరాశి
ఆరోగ్యం బాగుటుంది. సంపద పెరుగుతుంది. పనిలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమవుతారు. ఈ రాశివారికి అదృష్టం తలుపు తట్టబోతోందని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. మేషరాశివారికి అనుకోకుండా ధనలాభం ఉంది.

తులా రాశి
అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తవుతాయి. బంధువులతో కొంతకాలంగా ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది.. ఆరోగ్య పరంగా బాగుంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది.
కుంభ రాశి
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. అన్నిరకాలుగా ఈ రాశివారికి చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థికంగా వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గతం నుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
సింహ రాశి
మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులవారికి మహర్దశ పడుతుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది చాలా మంచి అనువైన సమయం.












Click it and Unblock the Notifications