Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astrology: వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది? తెలుసుకోండి!!

మన జీవితంపై రంగుల ప్రభావం ఎంతో ఉంటుంది. అయితే రంగుల ప్రాధాన్యత మాత్రం చాలా మందికి తెలియదు. రంగులకు మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు అంకితం చేయబడి ఉంటుంది. గ్రహాలు మన జీవితంలో సానుకూల ప్రభావాలు చూపించాలంటే రంగులకు స్థానం ఉంటుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రంగు ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం సోమవారం తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తెలుపురంగు శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం. సోమవారం చంద్రునికి ప్రతీక కావడంతో, ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Astrology: Which color is best in which day of the week? Find out!!

మంగళవారం నాడు అంగారక గ్రహానికి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి అంగారక గ్రహం యొక్క రంగులు అయిన కాషాయం, కుంకుమ రంగుల దుస్తులు ధరిస్తే మంచిదని చెప్పబడింది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మేధస్సు పెరుగుతుంది. గురువారం నాడు బృహస్పతి రోజు కావడంతో పసుపురంగు దుస్తులను ధరించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు రంగు అహింస, ప్రేమ, ఆనందం, మరియు జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.

శుక్రవారం నాడు శుక్ర గ్రహానికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఇక శనివారం నాడు శని అనుగ్రహం ఉన్న రోజు కాబట్టి ఈరోజు నలుపు రంగు, నీలం రంగు, ముదురు గోధుమ రంగు, ముదురు ఊదా రంగు దుస్తులను ధరించాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం నాడు సూర్యునికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈరోజు గులాబీ రంగు, బంగారం రంగు, ఎరుపు రంగులను ధరించడం వల్ల వ్యక్తి యొక్క రూపానికి ప్రకాశం వస్తుంది. వారి జీవితంలో గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. కనుక జీవితంలో సానుకూల ఫలితాలు కావాలంటే ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకోవాలి.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+