astrology: ఆడవాళ్ళకు ఎడమచెంప అదిరితే దాంపత్యసౌఖ్యం; ఏ శరీరభాగాలు అదిరితే ఏమవుతుందంటే!!

ఇంటికి వాస్తు ఎలా అవసరమో, వాస్తు జీవితంపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో కొన్ని శకునాలు కూడా భవిష్యత్ లో జరిగే సంఘటనల తాలూకు సంకేతాలు ఇస్తాయి. నిజ జీవితంలో మనం శుభ అశుభ శకునాలను గురించి చెప్పుకుంటూ ఉంటాం. శరీర భాగాలు అదరడం వల్ల కలిగే ఫలితాలను కూడా చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు మంచిదని, కుడి కన్ను అదిరితే పురుషులకు మంచిదని చెప్పుకుంటాం. అయితే స్త్రీల విషయంలో శరీర భాగాలు అదరడం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

స్త్రీల శరీరభాగాలు అదరటం వల్ల కలిగే ఫలితాలివే

స్త్రీల శరీరభాగాలు అదరటం వల్ల కలిగే ఫలితాలివే


చాలా సందర్భాలలో మన శరీర భాగాలు అదరడాన్ని మనం గమనిస్తాం. అయితే శరీర భాగాలు అదరడం వెనుక శుభ అశుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలకు యే శరీరభాగం అదరడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయానికి వస్తే.. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభం అని చెబుతారు. ఎడమ కన్ను పైభాగాన అదిరితే సంతోషకర వార్తలు వింటారు అని చెబుతారు. కుడి కన్ను అదిరితే స్తీలకు అశుభం అంటారు. కానీ కుడి కన్ను కొన దిగువ భాగం అదిరితే లాభం చేకూరుతుందని చెబుతారు. రెండు కళ్ల మధ్య భాగం అదిరితే జయం కలుగుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

చేతులు, పెదవులు, భుజాలు .. అదిరితే కలిగే ఫలితాలు ఇలా

చేతులు, పెదవులు, భుజాలు .. అదిరితే కలిగే ఫలితాలు ఇలా


ఇక ఎడమచెవి అదిరితే ఆభరణాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. పై పెదవి అదిరితే కలహాలు వస్తాయని, క్రింది పెదవి అదిరితే లాభం చేకూరుతుందని, గడ్డం అదిరితే భర్తతో కలహం వస్తుందని చెబుతారు. కుడి భుజం అదిరితే సంతానం నష్టాలు కలుగుతాయని, ఎడమ భుజం అదిరితే సుఖం కలుగుతుందని, కుడి చెంప అదిరితే ధన నాశనం జరుగుతుందని, ఎడమ చెంప అదిరితే దాంపత్య సౌఖ్యం దొరుకుతుందని చెబుతారు. చేతులు అదిరితే వాహన ప్రాప్తి లభిస్తుందని, మోచేతులు అదిరితే అలంకార ప్రాప్తి లభిస్తుందని, అరచేయి అదిరిన సంతాన లాభం కలుగుతుందని, కడుపు భాగం అదిరితే ధన లాభం జరుగుతుందని చెబుతారు.

ఆడవారికి ఎదమవైపు అదిరితే సాధారణంగా శుభాలు, కుడివైపు అశుభం

ఆడవారికి ఎదమవైపు అదిరితే సాధారణంగా శుభాలు, కుడివైపు అశుభం

ఇక బొటనవ్రేలు అదిరితే శుభసూచకమని, చూపుడువేలు అదిరితే బంధు నాశనం జరుగుతుందని, మధ్యవేలు అదిరితే కష్టాలు కలుగుతాయని, చిటికెన వేలు అదిరితే సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు. ముఖ్యంగా చూసుకుంటే ఆడవారికి ఎడమ వైపు శరీర భాగాలు అదిరిన ప్పుడు మంచి ఫలితాలు, కుడి వైపు శరీర భాగాలు అదిరిన ప్పుడు చెడు ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+