2025 చివరి మూడునెలలు ఈ రాశులవారికి తిరుగేలేదు.. బాబా వంగా అంచనా తప్పదు!
ప్రముఖ ఆస్ట్రాలజర్ బాబా వంగ గతంలో చెప్పిన భవిష్యవాణి ప్రస్తుతం అనేక సందర్భాలలో నిజమవుతుంది. బాబా వంగ చెప్పిన జ్యోతిష్య అంచనాలు దాదాపుగా నిజమయ్యాయని పేరుంది. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు జరుగుతాయని, రాజకీయ తిరుగుబాట్లు ఉంటాయని, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటాయని బాబా వంగ అంచనా వేసినట్టు ఇప్పటివరకు అవన్నీ జరుగుతూ వచ్చాయి.
బాబా వంగా జ్యోతిష్య అంచనాలు
ఇక 2025 సంవత్సరంలో చివరి మూడు నెలలు కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారని బాబా వంగ భవిష్యవాణి లో చెప్పారు. మొత్తం 90 రోజులపాటు అదృష్ట జాతకులుగా మారుతున్న ఆ రాశుల గురించి బాబా వంగ జ్యోతిష్య అంచనాల ప్రకారం తెలుసుకుందాం.

వృషభ రాశి
2025లో చివరి మూడునెలలు వృషభరాశిలో జన్మించిన వారికి శుభప్రదంగా ఉంటుందని బాబా వంగా పేర్కొన్నారు. ఈ సమయంలో సూర్యభగవానుడు ఈ స్థానికులకు ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తాడని, అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు మీకు వస్తాయని పేర్కొన్నారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఈ మూడునెలల్లో పెండింగ్ పనులు పూర్తవుతాయని, అదృష్టం వెన్నంటే ఉంటుందని తెలిపారు.
మిధున రాశి
మిధునరాశి జాతకులకు ఈ చివరి మూడు నెలలు చాలా బాగుంటుందని బాబా వంగ అంచనా వేశారు. ఈ సమయంలో మిధున రాశి జాతకులు బృహస్పతి ఆశీస్సులతో ఒక వెలుగు వెలుగుతారన్నారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని, కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మిధునరాశి వారి ఆరోగ్యం బాగుపడుతుందని, మనసు సంతోషంగా ఉంటుందని తెలిపారు. కుటుంబంలో శాంతి ఉంటుందన్నారు.
కన్య రాశి
బాబా వంగ జ్యోతిష్య శాస్త్ర అంచనా ప్రకారం 2025 చివరి మూడు నెలలు కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అన్నారు. కన్య రాశి జాతకుల సమస్యలు తొలగిపోయి సంపద వనరులు మెరుగుపడతాయి అన్నారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన పురోగతి ఉంటుందన్నారు. కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుందని, ఇష్టమైన వారి మద్దతు లభిస్తుందని అన్నారు.
కుంభరాశి
2025 సంవత్సరం చివరి మూడు నెలలు కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయని బాబా వంగ అంచనా వేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని, కెరీర్లో కొత్త మైలురాళ్లు సాధిస్తారని, ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వస్తాయని తెలిపారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయన్నారు. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది అన్నారు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న మధ్యకాలం కుంభ రాశి వారికి కలిసి వస్తుంది అన్నారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications