2026లో ఆర్దిక వ్యవస్థ నాశనం తధ్యం... హెచ్చరిస్తున్న బాబా వంగా జ్యోతిష్య అంచనా!

బాబా వంగ.. బల్గేరియన్ జ్యోతిష్య నిపుణురాలు. బాబా వంగ ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. బాబా వంగ జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజం కావడంతో ఆమె ఏం చెప్పినా జరుగుతుందని చాలామంది భావిస్తారు. ప్రతీ ఏడాది ఎలా ఉంటుంది ప్రపంచవ్యాప్త ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది ఆమె తన మరణం కంటే ముందే చెప్పింది. ఆమె జోస్యంపైన ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు విశేషమైన నమ్మకం ఉంది.

2026 దారుణంగా ఉంటుందన్న బాబా వంగా
బాబా వంగ బతికున్న సమయంలో చెప్పిన అనేక జ్యోతిష్య అంచనాలు నేటికీ నిజమవుతున్నాయి. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటాయని ఆమె చెప్పిన విషయాలు అక్షర సత్యం అయ్యాయి. 2026 సంవత్సరం, ఈ సంవత్సరం కంటే దారుణంగా ఉంటుందని బాబా వంగ ఆందోళనకరమైన విషయం చెప్పారు.

Baba Vanga astrological prediction warns of destruction in 2026

గ్లోబల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందన్న బాబా వంగ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందని, గ్లోబల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందని బాబా వంగ పేర్కొన్నారు. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని బాబా వంగ వెల్లడించారు. భౌతిక మరియు డిజిటల్ కరెన్సీల పతనం తప్పదని ఆమె అంచనా వేశారు.

2026 లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం
ప్రపంచ దేశాలు ఎప్పుడూ చూడని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభం, ఆర్థిక మాంద్యం, ఆర్థిక విధానాలలో అస్థిరత లతో ఇబ్బంది పడుతున్న దేశాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 2026 లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని బాబా వంగ అన్నారు. దీనిని చాలామంది మూడవ ప్రపంచ యుద్ధం గా భావిస్తున్నారు.

మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం
ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా, తైవాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా బాబా వంగ జ్యోతిష్య శాస్త్ర అంచనాలు అనేక సందర్భాలలో నిజమైనందున 2026 సంవత్సరంలో భయానక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+