• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: బెడ్ రూమ్ లో ఉండకూడనివి ఇవే.. అద్దం అక్కడఉంటే ప్రతికూల ప్రభావం

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో బెడ్ రూమ్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది అన్న విషయం తెలిసిందే. బెడ్ రూమ్ కి సంబంధించిన వాస్తు ఏ విధంగా ఉండాలి? బెడ్ రూమ్ ఏ విధంగా ఉంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది? భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగుతుంది అనే అంశాలపై వాస్తు శాస్త్రం లోని అనేక కీలక విషయాలను మీకోసం అందిస్తుంది వన్ఇండియా.

బెడ్ రూమ్ లో ఉండకూడనివి కూడా ఉన్నాయని చెప్తుంది వాస్తు శాస్త్రం

బెడ్ రూమ్ లో ఉండకూడనివి కూడా ఉన్నాయని చెప్తుంది వాస్తు శాస్త్రం

బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించాలని ఇంట్లో మాస్టర్ బెడ్రూం నైరుతి మూలలో ఉండాలని, పిల్లల బెడ్రూమ్ పడమర ముఖంగా, గెస్ట్ బెడ్ రూం తూర్పుముఖంగా ఉండేలా నిర్మించుకోవాలని తెలుసుకున్నాం. బెడ్ రూమ్లో ఉపయోగించాల్సిన రంగుల దగ్గరనుండి, బెడ్ ఆకృతి వరకు ప్రతి ఒకటి మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక బెడ్ రూమ్ ఫర్నిచర్ ఏ విధంగా ఉండాలి? బెడ్ రూమ్ ఏ విధంగా సర్దుకోవాలి? బెడ్రూంలో ఉండకూడనివి ఏమిటి? వేటి వల్ల బెడ్ రూమ్ లో చెడు ఫలితాలు వస్తాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

 బెడ్ రూమ్ లో వార్డ్ రోబ్ లు, బీరువాలు ఉండాల్సింది ఇక్కడే

బెడ్ రూమ్ లో వార్డ్ రోబ్ లు, బీరువాలు ఉండాల్సింది ఇక్కడే


మీరు ఇంట్లో మంచి అనుభూతిని పొందటానికి బెడ్‌రూమ్‌ల ఫర్నిచర్‌ను సరిగ్గా ఉంచడం చాలా అవసరం. పడకగది కోసం వార్డ్ రోబ్ లు, బీరువాలు బరువైన వస్తువులను దక్షిణ, నైరుతి లేదా పశ్చిమ దిశలో ఉంచాలని సూచిస్తున్నారు. వాయువ్య దిశలోనూ వార్డ్‌రోబ్‌లను ఉంచవచ్చు. ఈ దిశలు సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి. వస్తువులు చిందరవందరగా పెడితే ఆ గదిలో ఉండేవారికి ఎప్పుడూ చిరాకులే ఉంటాయి. ఇక ప్రతికూల శక్తిని ప్రతిబింబించే అవకాశం ఉన్నందున వార్డ్‌రోబ్ లేదా అల్మరా తలుపులపై అద్దాలను ఉంచకూడదని గుర్తుంచుకోండి.

అద్దం బెడ్ ను ప్రతిబింబిస్తే అరిష్టం .. నెగిటివ్ ఎనర్జీకి అది మూలం

అద్దం బెడ్ ను ప్రతిబింబిస్తే అరిష్టం .. నెగిటివ్ ఎనర్జీకి అది మూలం

అద్దం బెడ్‌ను ప్రతిబింబించకుండా చూసుకోండి, అది గదిని ఉపయోగించే వ్యక్తికి దురదృష్టాన్ని తెస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు అద్దాలు మీ శరీరాన్ని ప్రతిబింబించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు పడుకున్నప్పుడు అద్దం మీ శరీరాన్ని ప్రతిబింబించదని గ్యారెంటీ ఇచ్చే విధంగా మంచం పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడం శుభప్రదం. వాస్తు ప్రకారం అద్దం భూమికి నాలుగైదు అడుగుల ఎత్తులో ఉంచాలి. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ప్రతికూల శక్తులను ఆకర్షించే విధంగా రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు.

ముదురు రంగుల వల్ల మనసుపై చెడు ప్రభావం, టీవీల వల్ల నిద్రాభంగం

ముదురు రంగుల వల్ల మనసుపై చెడు ప్రభావం, టీవీల వల్ల నిద్రాభంగం

మంచం ముందు అద్దాలు ఉండటం వల్ల అవి పీడకలలను కలిగిస్తాయి. ముదురు రంగులు గదిలో ఉపయోగించినట్లయితే అది మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. అందుకే కచ్చితంగా బెడ్ రూమ్ లలో లేత రంగులను ఉపయోగించాలి. గాడ్జెట్‌ల నుండి వచ్చే శక్తి నిద్రకు భంగం కలిగిస్తుంది. పడకగదిలో టెలివిజన్లు మరియు ఉపకరణాలను నివారించడం ఉత్తమం. ఎందుకంటే ఇవి మీ నిద్రకు భంగం కలిగించే శక్తిని పంపుతాయి. కానీ, మీరు మీ గదిలో టీవీని కలిగి ఉండకుండా ఉండలేకపోతే, అవి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోండి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగం హానికరమైన రేడియేషన్ ను విడుదల చేస్తాయి కాబట్టి అవి ఒత్తిడిని ప్రేరేపిస్తాయి.

బెడ్ రూమ్ వాస్తు పాటిస్తే జీవితం సుఖవంతం

బెడ్ రూమ్ వాస్తు పాటిస్తే జీవితం సుఖవంతం


సానుకూల వైబ్‌లను మెరుగుపరచడానికి కుటుంబ చిత్రపటాన్ని లేదా పువ్వులను గదిలో అలంకరించుకోండి. మీ పడకగది తలుపు తొంభై డిగ్రీల వద్ద తెరవాలి. ఇది ఎటువంటి శబ్దాలు రాకుండా ఉండేలా చూసుకోండి.వాస్తు ప్రకారం, పడకగదికి సరిపోయే రంగులు లేత గులాబీ, బూడిద, నీలం మరియు ఆకుపచ్చ, కేవలం లేత రంగులనే వినియోగించండి. అన్ని జాగ్రత్తలు పాటించి బెడ్ రూమ్ వాస్తు పక్కాగా పాటిస్తే సుఖవంతమైన జీవితం మీ సొంతం.

English summary
bedroom architecture is an important role in house peace. architecture said that so many things that should not be in the bedroom. Negative effect if the mirror is in wrong place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X