ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు
ఏప్రిల్ మాసంలో కీలక గ్రహసంచార కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని, బుధుడు, కుజుడు మీనరాశిలో కలిసి చతుర్గ్రాహి యోగం ఏర్పరుస్తున్నారు. ఇదే సమయంలో శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించి శక్తివంతమైన మాలవ్య రాజయోగాన్ని సృష్టించనున్నాడు. ఈ గ్రహస్థితి మేష, వృషభ రాశితో సహా ఐదు రాశులవారికి శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు అన్ని విధాల ప్రయోజనాలను పొందుతారు.
మేషరాశి
ఏప్రిల్ మాసంలో చతుర్గ్రాహి యోగం మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం, కుజుడి బలహీనత ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మార్పు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఏప్రిల్ మాసంలో చతుర్గ్రాహి యోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది. గురువు ద్వితీయ స్థానంలో, శుక్రుడు స్వరాశిలో సంచరించడం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతుతో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో విలాసాలతో జీవిస్తారు.
సింహరాశి
ఏప్రిల్ మాసంలో చతుర్గ్రాహి యోగం సింహరాశి జాతకులకు అనుకూలతలను తెస్తుంది. సింహరాశి జాతకులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, పరిస్థితులు నిదానంగా అనుకూలంగా మారుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. రాజకీయాలలో ఉన్న వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
తులారాశి
ఏప్రిల్ మాసంలో చతుర్గ్రాహి యోగం తులా రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. వీరికి కెరీర్లో పురోగతి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు సాధ్యమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. తులా రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేస్తారు.
ధనుస్సు రాశి
ఏప్రిల్ మాసంలో గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే చతుర్గ్రాహి యోగం ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications