వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ జయంతి వేడుకలు.. పూజా విధానాలు ఎలా అంటే..

|
Google Oneindia TeluguNews

దత్తాత్రేయను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. దత్తాత్రేయుడు అతి పురాతన దేవుళ్లలో ఒకడు. ఈ దేవుడి గురించిన ప్రథమ ప్రస్తావన మహాభారత మరియు రామాయణం వంటి మహాకావ్యాలలో కనబడుతుంది.

దత్తాత్రేయ స్వామి ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది - గురు ( ఆది గురువు ) గా గుర్తిస్తున్నారు . దత్తాత్రేయ మొట్ట మొదటిలో యోగ దేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు.

Dattatreya Jayanthi celebrations: Its pooja rituals

దత్తాత్రేయ స్వామి జీవితం :-

నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" ( భర్త పట్ల భక్తిభావం ) గురించి బ్రహ్మ - విష్ణు - శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు . దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు . అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి తమకు భోజనం పెట్టమని అడిగారు .

అతిధి భోజనం సాంప్రదాయ మర్యాద ,ఎంతో పుణ్యంతో కూడుకున్నది కాబట్టి ఆమె అందుకు అంగీకరించగానే అప్పుడు త్రిమూర్తులు అనసూయ భక్తిని పరీక్షించుటకే వచ్చారు కాబట్టి నివు వడ్డించిన భోజనం మేము తినాలి అంటే నీవు ఒంటిపై ఒక్క నూలు పోగు కుడా లేకుండా అంటే అనసూయ శరీరంపై బట్టలు లేకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు శరత్తు పెట్టరు . అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది.

పర పురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది.

అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" ( ఓ మాతా! మాకు భిక్ష ప్రసాదించు ) అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు.తనకున్న దైవశాక్తితో ,పతిభక్తితో ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు త్రాగించి ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది.

తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయ ద్వార తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల అంశలతో దూర్వాసుడు దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది.

మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి . దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు . తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు బెల్లంతో చేసిన రొట్టెలను ,సజ్జ బూరెలను వాటికి ఆహారం పెట్టటం సాంప్రదాయం .

మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశ వృక్షంగా ప్రస్తావించబడతాడు . మాఘ కవి రచించిన శిశుపాల వధ ( శిశుపాలుడిని వధించడం ) కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి వంశవృక్షంగా పేర్కొంటోంది .

దత్తాత్రేయ స్వామి యాత్రలు:-

పరమసత్యం కోసం అన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి నగ్నంగా తిరుగసాగాడు. అతడు తన జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్నాటక , మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ , మరియు గుజరాత్ లోని నర్మదా నది ప్రాంతాలలో తిరిగినట్లు కనబడుతోంది . ప్రస్తుతం ఉత్తర కర్నాటకలోని గనకపుర అని వ్యవహరించబడుతున్న పట్టణంలో అతడికి జ్ఞానోదయం కలిగింది . గిరినార్‌లోని ఒంటరి పర్వతాగ్రం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయని జనం విశ్వసిస్తున్నారు . అనుయాయి పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర - రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్త ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది.

దత్తాత్రేయ స్వామి గురువులు :-
తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుని ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానం ( శాశ్వత జ్ఞానం ) పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది . అందుకనే దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు.

ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపర్చబడింది . దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది . ఇందులో కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు . భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. దత్తాత్రేయుడి 24 గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత్ యొక్క 24 గురువులనుంచి వచ్చారు.

దత్తాత్రేయ స్వామి అమరత్వం యొక్క అగమ్య గమ్యంలో వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీ దత్తాత్రేయుడు చిన్నవయసులోనే ఇల్లు వదిలి వెళ్లాడు . దత్తాత్రేయుడు వంటి పురుషులే దీన్ని సాధ్యం చేశారు . అతడి ముగ్గురు సన్నిహిత అనుయాయులు రాజులు ఒకరు అసురుడు మరియు మిగిలిన ఇద్దరూ క్షత్రియ కులానికి సంబంధించిన వారు. దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర (శివ) అవతారంగా భావించుకునేవాడు , తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువుగా ప్రకటించారు . శివ , విష్ణువులు ఇద్దరూ ఒకటేనని లేదా పరమసత్య రూపపు వ్యక్తీకరణలుగా గుర్తిస్తుంటారు.

English summary
Saint Dattatreya represents Lord Brahma, Lord Vishnu, Lord Maheshwara. He Birthday celebrations will treated as holy rituals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X