ధన త్రయోదశి 2024.. లక్ష్మీ కటాక్షం కోసం బంగారం బదులు వీటిని కొనండి చాలు!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ధన త్రయోదశి నేడు. దీపావళికి రెండు రోజుల ముందు జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ధన త్రయోదశి పండుగ రోజు చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బంగారు షాపులు ధన త్రయోదశి పండుగ నాడు కిటకిటలాడుతాయి.
ధన త్రయోదశి రోజు ఏమి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది?
అయితే ఈ సంవత్సరం బంగారం ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేసే దానికంటే ధన త్రయోదశి రోజు ఏమి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. ఏమి కొంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధన త్రయోదశి సమయం ఇదే
ధన త్రయోదశి పండుగ అక్టోబర్ 29 ఉదయం 10:30 కు ప్రారంభమై అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక ధన త్రయోదశి రోజున ధన్వంతరిని, కుబేరుడిని, లక్ష్మీదేవిని, వినాయకుడిని విశేషంగా పూజిస్తారు. అయితే కొత్త వస్తువులను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
ధన త్రయోదశికి వీటిని కొనుగోలు చేస్తే మంచిది
అయితే ఈ సంవత్సరం ధన త్రయోదశికి బంగారం కొనుగోలు చేయలేని వారు కొత్త బట్టలు కొనుగోలు చేస్తే మంచిది. అలాగే చీపురు కొనుగోలు చేసినా మంచి జరుగుతుంది. ధనత్రయోదశి రోజు చీపురు కొనుగోలు చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి దూరమవుతుంది పేదరికం నశిస్తుంది. ఇంట్లో సానుకూలత మరియు శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి శుభ్రత ఉన్నచోటే ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రపరిచే చీపురును కొనుగోలు చేయడం లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతుంది.
తమలపాకులతో పాటు ఇవి కొనుగోలు చెయ్యండి
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలనుకునేవారు తమలపాకులను కొనుగోలు చేస్తే మంచిది తమలపాకులు స్వచ్ఛతకు తాజాదనానికి చిహ్నంగా చెబుతారు. కాబట్టి హిందూ పూజలలోను, ఆచారాలలోనూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. కాబట్టి ఈరోజు తమలపాకును కొనుగోలు చేసిన ఫలితం ఉంటుంది. ధన త్రయోదశి రోజు మరమరాలు కొనుగోలు చేసే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే కూడా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది.
లక్ష్మీ కటాక్షం కోసం వీటిని తెచ్చుకోండి
ధన త్రయోదశి రోజు వినాయకుడి విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసే ఇంటికి తెచ్చుకుంటే సంపద, శ్రేయస్సు వృద్ధి జరుగుతుంది. గణేశుడు మన జీవితంలో ఉండే ఆటంకాలను తొలగించి మనకు శుభాలను చేకూరిస్తే, లక్ష్మీదేవి కటాక్షంతో మనకు కావలసిన ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ధన త్రయోదశి రోజు దొడ్డు ఉప్పును కొనుగోలు చేయడం కూడా మంచి చేస్తుంది. ఇది మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీలను దూరం చేసి ఇంటికి మేలు చేస్తుంది. కాబట్టి ధనత్రయోదశి రోజు ఉప్పును కూడా కొనుగోలు చేయవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications