
ఇంట్లో ఈ దిక్కున వినాయకుడి విగ్రహం పెట్టకండి; గణేశుడిని సరైనస్థానంలో పెడితేనే సంపదవర్షం!!
హిందూమతంలో గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం తప్పనిసరి అని భావిస్తారు. గణేశుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా భావిస్తారు. అందరి దేవుళ్ళ కన్నా ముందు పూజలందుకునే ది ఆదిదేవుడైన విజ్ఞ వినాయకుడే.. అందుకే ఆయనకు విఘ్నహర్త అని పేరు. వేదాలలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతిని ఇంట్లో ప్రతిష్టించడం ద్వారా, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. దీంతో పాటు ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది.
Vastu tips: తీవ్రమైన వాస్తుదోషాలు ఉంటే వచ్చే సమస్యలివే; అందుకే వాస్తుదోషాలను లైట్ తీసుకోకండి!!

గణపతి విగ్రహాన్ని తప్పు దిశలో పెడితే ఆర్థిక ఇబ్బందులు
వాస్తు ప్రకారం, ఇంట్లో గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచేటప్పుడు దిశను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గణపతి విగ్రహాన్ని తప్పుగా ఉంచినట్లయితే జీవితంలో అనేక ఇబ్బందులను,ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు ప్రకారం, గణేశుడు విగ్రహాలను ఏ విధంగా పెట్టాలో కొన్ని సూచనలు ఇక్కడ చేయబడ్డాయి. ఎటువంటి గణేష్ విగ్రహాలను కొనుగోలు చెయ్యాలో, ప్రతి ఇంట్లో గణపతిని ఏ విధంగా పెట్టుకోవాలి అనే అంశాల గురించి వాస్తు శాస్త్ర నిపుణులు పలు సూచనలు చేశారు.

గణపతి విగ్రహాన్ని ఈ దిశలోనే పెట్టాలి
వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుని విగ్రహాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం చాలా మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక గణపతి విగ్రహాన్ని ఇంటికి దక్షిణం వైపు మరిచిపోయి కూడా ప్రతిష్టించి కూడదని, అలా పెడితే ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. అంతేకాదు మరుగుదొడ్లు, డస్ట్‌బిన్‌లు, స్టోర్ రూమ్‌లు, మెట్ల కింద మొదలైన గోడలకు గణపతి చిత్రపటాన్ని పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ భంగిమలో ఉన్న గణపతి విగ్రహాన్ని పెడితే ప్రశాంతత
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు భంగిమను గుర్తుంచుకోండి. లలితాసనంలో కూర్చున్న వినాయకుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకురావడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ ముద్ర ప్రశాంతత మరియు శాంతిని సూచిస్తుంది. ఇది కాకుండా, పడుకున్న స్థితిలో ఉన్న గణపతి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకురావచ్చు. ఎందుకంటే గణపతి యొక్క అటువంటి భంగిమ విలాసాన్ని, సౌకర్యం మరియు సంపదను సూచిస్తుంది. ఈ గణపతి విగ్రహాన్ని పెడితే సంపద వర్షం కురుస్తుంది.

గణేశుని విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు తొండం ఏ దిశలో ఉందో చూసుకోవాలి
వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, ఆయన తొండం ఏ దిశలో ఉందో తెలుసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, వినాయకుడి తొండం ఎడమ వైపుకు వంగి ఉండే అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ దిశ విజయం మరియు సానుకూల శక్తిని సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, గణపతి చేతిలో మోదకం ఉండాలి. ఎందుకంటే మోదకం గణపతికి ఇష్టమైన ఆహారం. ఆయన వాహనం ఎలుక ఉండాలి. ఎందుకంటే ఎలుక మన మనస్సు మరియు భౌతిక కోరికను సూచించే వాహనం.

చాలా గణేషుడి విగ్రహాలు పెడితే ప్రతికూల ఫలితాలు
ఇంట్లో ఒక్క గణేష్ విగ్రహాన్ని మాత్రమే ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని చెబుతున్నారు. అందుకే ఇంట్లో రకరకాల గణేషుని విగ్రహాలకు బదులు, ఒకే ఒక్క లలితాసనంలో కూర్చున్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.