మీకు తెలుసా.. రెండు రకాల వ్యక్తుల ఇళ్ళలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు!!
లక్ష్మీదేవిని శాస్త్రాలలో సంపదకు దేవతగా పరిగణిస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటే ఆర్థిక సంక్షోభం ఉండదని, కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని, సంపద వస్తుందని చెబుతారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివసించదో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని కూడా చెబుతారు. అయితే లక్ష్మీదేవి రెండు రకాల వ్యక్తుల ఇళ్లల్లోకి వెళ్లడానికి ఇష్టపడదని చెబుతున్నారు. అందుకే కొంతమంది ఎంత కష్టపడినా పేదరికంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.
లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ఆ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంట్లోని కుటుంబ సభ్యులు దుఃఖానికి దూరంగా ఉండాలి. గొడవలు, ఏడుపులు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అంతేకాదు లక్ష్మీదేవి ఇష్టంగా రావాలి అంటే ఇల్లు శుభ్రతతో పాటు, ఇంట్లో ఎప్పుడూ దీపం పెట్టి పూజలు చేస్తుండాలి. అసలే పూజ చేయని ఇళ్లకు కూడా లక్ష్మీదేవి రాదు అని చెబుతారు.

మరీ ముఖ్యంగా రెండు రకాల వారి ఇళ్ళకు లక్ష్మీదేవి అసలే వెళ్లదని, వారు బ్రతికినంత కాలం పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు. లక్ష్మీ మరియు దరిద్ర దేవత కలిసి రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య బయటకు వెళతారు. మళ్ళీ ఉదయమే తిరిగి వస్తారు. కానీ లక్ష్మీదేవి మాత్రం రెండు రకాల వ్యక్తులు ఇళ్లకు అసలే వెళ్లదు.
ఎవరి ప్రధాన ద్వారం మురికిగా ఉంటుందో, అటువంటి వ్యక్తుల ఇళ్లల్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయాలి. నీళ్ళు చల్లి, ముగ్గు పెట్టి, దీపం వెలిగించి, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. అంతేకాదు సూర్యోదయం తర్వాత కూడా మంచం మీద పడుకునే వారితోపాటు, లక్ష్మీదేవి నివసించదు.
అటువంటి వారి ఇళ్లకు లక్ష్మీదేవి అసలే వెళ్లదు.లక్ష్మీదేవికి బదులుగా ఈ రెండు రకాల వ్యక్తుల ఇళ్లల్లోకి దరిద్ర దేవత ప్రవేశించి వారి అన్ని ఆనందాలను, శ్రేయస్సును నాశనం చేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అనుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో కనిపించాలి. దరిద్ర దేవతకు స్వాగతం పలికినట్టు గా అనిపించకూడదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications