వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేసవికాలంలో ఈ దానాలు చేస్తే.. ఆరోగ్యం, సంపదతో పాటు మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు!!

|
Google Oneindia TeluguNews

హిందూ ధర్మంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన జీవితంలో ఉండే దోషాలు, మనకు తెలీకుండా చేసిన పాపాలు దానం చేస్తే తొలగిపోతాయని చెప్తారు. ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక తిథులలో, పండుగ సమయాలలో దానం చేయడం వల్ల అనేక విధాల ఫలితాలు కలుగుతాయి. కానీ ధర్మశాస్త్రాలలో దానధర్మం గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి. సరైన సమయానికి, సరైన రోజుకి దానం చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుందని చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో రుతువుల ప్రకారం దానధర్మాలు ఏ విధంగా చేయాలో కూడా చెప్పబడింది.

వేసవిలో దానం చేస్తే కలిగే ఫలితాలు

వేసవిలో దానం చేస్తే కలిగే ఫలితాలు


ఎండాకాలం మొదలైంది. విపరీతంగా ఎండలు మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సీజన్‌లో దానం చేయడం మరింత పుణ్యం వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఈ వస్తువులను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యోతిషశాస్త్రంలో కాలానుగుణంగా చేయవలసిన దానధర్మాలను వివరించి, వేసవికాలంలో ఈ దానాలు చేసిన వారికి ఆరోగ్య వృద్ధి, సంపద వృద్ధి, సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని చెప్తారు.

 వేసవిలో నీరు దానం.. దాహార్తి తీర్చటం; కలిగే ఫలితం ఇదే

వేసవిలో నీరు దానం.. దాహార్తి తీర్చటం; కలిగే ఫలితం ఇదే


వేసవికాలంలో దానం చేయవలసిన మరో పదార్థం నీరు. వేసవికాలంలో దాహంతో ఉన్నవారికి నీటిని తాగించడం అత్యంత పుణ్యమైన పనిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సీజన్లో ప్రతి చోట నీటి కుండలు పెట్టాలి. ప్రజలను నీరు తాగే ఎలా చేయాలి. వేసవికాలంలో నీరు నింపిన రెండు బిందెలను దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతారు. నీటిని దానం చేసేటప్పుడు, ఒక బిందె ను మీ పూర్వీకుల పేరుమీద, మరొకటి విష్ణువు పేరుమీద దానం చేయాల్సిందిగా శాస్త్రం చెబుతోంది. ఇక ఈ దానం చేసే సమయంలో బిందెడు నీళ్లల్లో కాస్త బెల్లం ముక్క కానీ, పంచదార కానీ వేసి దానం చేస్తే మరింత ఫలితముంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఇలా దానం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది.

వేసవిలో బెల్లం దానం.. ప్రయోజనం ఇదే

వేసవిలో బెల్లం దానం.. ప్రయోజనం ఇదే

వేసవికాలంలో బెల్లం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి యొక్క జాతకం లో సూర్యుడు స్థానం బలపడుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జీవితంలో చాలా గౌరవాన్ని పొందుతాడు, అంతే కాదు అభివృద్ధి లోకి వస్తాడు.

 వేసవిలో మామిడి పండ్ల దానంతో సూర్యుడి అనుగ్రహం

వేసవిలో మామిడి పండ్ల దానంతో సూర్యుడి అనుగ్రహం


ఇక వేసవి కాలంలో దానం చేయవలసిన మరొక పదార్థం మామిడి పండ్లు. కాలానుగుణమైన పండ్లను దానం చేయాలని గ్రంథాలలో సూచించబడింది. మామిడి పండు సూర్యభగవానుడికి సంబంధించిన పండు. అందుకే వేసవికాలంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల ఆ సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది.

ధాన్యం దానంతో కలుగును శుభం

ధాన్యం దానంతో కలుగును శుభం

ఇక వేసవి కాలంలో దానిని చేయాల్సిన ఇంకొక వస్తువు ధాన్యం. జ్యోతిషశాస్త్రంలో గురువు మరియు సూర్యుడు తో ధాన్యానికి సంబంధం చెప్పబడింది. గురువు సంపద మరియు అదృష్టాన్ని పెంచే గ్రహం, సూర్యుడు గౌరవాన్ని మరియు ఆరోగ్యాన్ని బలపరిచే గ్రహం. ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో చాలా శుభాలను, విజయాలను పొందుతారు. ధాన్యాన్ని దానం చేయడం వల్ల ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధాన్యం దానం వల్ల మనుషులకు పరలోకములో కూడా ఆహార కొరత ఉండదని చెబుతారు.

English summary
Donating water, mangoes, jaggery and grains during the summer will bring you unexpected benefits along with health and wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X