వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాశిని బట్టి భోజనం: మీ రాశి ఏది, మీకు ఏది మంచిది?

By Pratap
|
Google Oneindia TeluguNews

రాశుల ప్రకారం వ్యక్తుల మనస్తత్వాలు, వారి జాతక చక్రం ఉంటాయని అంటారు. భవిష్యత్తు కూడా దాని ప్రకారమే నిర్ణయమవుతుందని కూడా చెబుతారు. అందులో భాగంగానే ఒక్కో రాశి వారికి భవిష్యత్తు ఒక్కో విధంగా ఉంటుందని అంటారు.

Recommended Video

Daily Horoscope దిన ఫలాలు 12-12-2017

అయితే, ఆహారం కూడా రాశుల ప్రకారమే తినాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఏ రాశి వారు ఎలాంటి ఆహారం తింటే జాతక చక్రం ప్రభావితం అవుతుందో చూద్దాం

మేష రాశి

మేష రాశి

ఈ రాశి వారికి సహజంగానే ఆకలి మిక్కిలి. వీరు స్పైసీ ఫుడ్ తినడం మంచిది. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం అంటే వీరికి మక్కువ. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వీరు తీసుకోవాలి. దానివల్ల రాశి ప్రభావం వల్ల వీరికి వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీరు మద్యం మాత్రం సేవించకూడదు.

 వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశివారికి కూడా తిండి అంటే మక్కువ. భోజన ప్రియులుగా వీరు ఉంటారు. ఈ రాశి వారు స్వీట్లు, బ్రెడ్ వంటివి తినకూడదు. తాజా పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది.

మిథున రాశి

మిథున రాశి

వీరు బరువు ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ ఆహారం అయినా తినవచ్చు, కానీ సమయాన్ని పాటించాలి. కచ్చితంగా రోజూ కచ్చితమైన వేళకు భోజనం చేయాలి. బయట లభించే జంక్ ఫుడ్ తినకూడదు. అయితే అది అంటే వీరికి ఇష్టం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

వీరికి ఇంటి భోజనమే ఇష్టం. బయటి ఆహారంపై ఆసక్తి ప్రదర్శించరు. ఏ ఆహారం తిన్నా అందులో నాణ్యతను కోరుకుంటారు. అతిగా తిన్నప్పుడు ఇబ్బంది పడుతారు. ఈ రాశి వారు స్పైసీ ఫుడ్ తినడం మంచిది. అయితే, అతిగా భుజించకూడదు, నియంత్రణ అవసరం.

సింహ రాశి

సింహ రాశి

ఖరీదైన భోజన పదార్థాలను ఇష్టపడుతారు. విలాసవంతమైన విందుల కోసం చూస్తుంటారు. వీరికి వంట చేయడమంటే చిరాకు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలని అనుకుంటారు. తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తింటే మంచిది.

కన్య రాశి

కన్య రాశి

వీరికి మెటబాలిజం తక్కువ. అందువల్ల తక్కువ మోతాదులో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచిది. పచ్చి కూరగాయలు తింటే మంచిది. జీర్ణ శక్తి పెరుగుతుంది. నిల్వ ఉంచిన ఆహారాలను తినకూడదు.

తుల రాశి

తుల రాశి

వీరు భోజన ప్రియులని చెప్పక తప్పదు. మద్యంతో ఆహారాన్ని తీసుకోవడంపై మక్కువ ఎక్కువ చాకొలేట్లు, స్వీట్లు ఇష్టంగా తింటారు. దానికోసం భోజనాన్ని కూడా మానేస్తారు. అయితే వీరికి చాకొలేట్లు, స్వీట్లు మంచివి కావు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని వీరు ఇష్టంగా ఆరగిస్తారు. వంటలను రుచికరంగా చేయగలరు. ఆహార నియమాలను పాటిస్తారు. వీరికి మద్యం మంచిది కాదు.నీరు, టీ ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

స్పైసీ ఫుడ్ ఇష్టపడుతారు. అతిగా తింటారు. దీంతో వీరికి స్థూలకాయం, బీపీ, జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఫలానా ఆహారం మాత్రమే తినాలనే నియమం లేదు, కానీ తక్కువ మోతాదులో ఆరగించాలి.

మకర రాశి

మకర రాశి

వీరు ఎక్కువగా శ్రమిస్తారు. మంచి భోజనం చేయాలని అనుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయడాన్ని ఇష్టపడుతారు. ఇంటి వంటే వీరికి ఇష్టం. వీరికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఉప్పు వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

 కుంభ రాశి

కుంభ రాశి

ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఇష్టపడుతారు. ఇతరులకు ఆహారం పంచివ్వడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది.

మీన రాశి

మీన రాశి

వీరు కూడా భోజన ప్రియులే. మద్యం సేవిస్తూ ఆహారం తీసుకోవడం వీరికి బహు పసందు. వీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి.

English summary
According to Jyothisham one should take food according to his rasi. Read this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X