2027 వరకు ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. మార్చి 29న మకర రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. అంటే 2027 సెప్టెంబరు వరకు సంచారం చేస్తుంటాడు. దీనివల్ల నాలుగు రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది వారి జీవితంలో కీలక మార్పులను కలిగిస్తుంది. వీరికి శని వల్ల ఏ విధంగా కలిసిరానుంది? ఎటువంటి అదృష్టం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
2027 సంవత్సరం వరకు వీరు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. అద్భుతమైన కార్యాలను పూర్తిచేస్తారు. ఈ సమయంలోనే కొన్ని శుభవార్తలు మీ చెవిన పడతాయి. కార్లతోపాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసే సమయం ఇది. శని దయతో కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.

కర్కాటక రాశి
ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఊహించని రీతిలో ధనలాభం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. అదృష్టం కలిసివచ్చు అందరి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.
కుంభరాశి
ఉద్యోగస్థులకు మంచి లాభాలుంటాయి. ఈ రాశివారు కోర్టు కేసుల్లో విజయాలను అందుకుంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఊహించని ధనలాభం ఉంది. డబ్బును ఆదా చేస్తారు. భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తారు. పూర్తిస్థాయిలో పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా ఉంటారు.
వృషభ రాశి
కెరీర్ పరంగా అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా మారి వచ్చిన ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తారు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 2027 వరకు ఒకరకంగా వీరికి తిరుగులేదని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications