ఈనెల 16 తర్వాత ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని శక్తివంతమైన రాజయోగాలను కూడా ఏర్పరుస్తుంటాయి. నీడ గ్రహాలని, కీడు తలపెడతాయని అందరూ భావించే రాహువు, కేతువు ఈనెల 16వ తేదీన సంచారం చేస్తున్నాయి. ఎప్పుడూ తిరోగమనదిశలో పయనించే ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు 18 నెలల సమయం తీసుకుంటాయి. ఈ ప్రభావంవల్ల నాలుగు రాశులవారికి అనేక సుఖాలు కలుగుతున్నాయి. కొత్తగా ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏయే రాశులకు ఎలా కలిసిరానుందనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కర్కాటక రాశి
ఈ రాశివారిలో ధైర్యం విపరీతంగా పెరిగి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కెరీర్ పరంగా అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అదృష్టం కలిసిరావడంతో పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి.

four zodiac signs will get biggest success and money due to rahu and ketu transit after march 16th

వృషభ రాశి
ఈ రాశివారికి అధికంగా భౌతిక సుఖాలున్నాయి. కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చిన డబ్బును మరింత రాబడి వచ్చేలా పెట్టుబడులు పెడతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు రాహువు, కేతువుకు పూజలు జరిపిస్తే ఇంకా మంచిది.

తులా రాశి
ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో ప్రయోజనాలున్నాయి. వీరు డబ్బు సంపాదనను రహస్యంగా ఉంచుతారు. ఎవరికీ చెప్పరు. చెబితే ఆదాయం తగ్గిపోతుందని వీరి ఆలోచన. ఊహించనిస్థాయిలో వీరి సంపద పెరుగుతుంది. అలాగే ఆదాయం కూడా అనేక మార్గాల్లో వస్తుంది.

మేష రాశి
ఉద్యోగస్థులకు కొన్నాళ్లుగా ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. కొన్నాళ్లుగా సాధారణంగా ఉన్న తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం గట్టిపడుతుంది. ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. డబ్బుకు ఎటువంటి సమస్య ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+