ఆ జాతకానికి తిరుగులేదు... 30 రోజుల్లో ఈ రాశులవారు కుబేరులవుతున్నారు
నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యుడు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాడు. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలిగిస్తే మరికొన్ని రాశులకు వారి వారి కర్మలను బట్టి చెడు ఫలితాలు ఎదురవుతుంటాయి. సూర్యుడు రాశిని మారుస్తుండటంవల్ల కొన్ని రాశులకు మంచి సమయం వచ్చింది. వచ్చే నెల 15వ తేదీన ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు అదే రాశిలో సూర్యుడు సంచరిస్తుంటాడు. ప్రధానంగా నాలుగు రాశులవారికి దీనివల్ల కలిసిరాబోతోంది. ఏయే రాశులనేది తెలుసుకుందాం.
మేషం
ఈ రాశివారికి అదృష్టం మెండుగా ఉంటుంది. డబ్బును పొదుపు చేస్తారు. వివిధ మార్గాలద్వారా ఆదాయం రావడానికి అనేక మార్గాలు తోడవుతాయి. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరు విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు.

మిథునం
దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. అనుబంధం బలపడుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. అలాగే కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంది. విదేశాలకు వెళ్లాలనుకనేవారు ఈ సమయంలో ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సింహం
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడంతో పెరిగిన లాభాలను ఇతర వ్యాపారాలవైపు విస్తరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బును పొదుపు చేసే విషయంలో అందరి సలహాలు, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ధనస్సు
వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు ఈ రాశిలోనే సంచారం చేయనున్నాడు. ఉద్యోగస్తులకు మాత్రం బాగా కలిసివస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితితోపాటు రాశులవారి ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications