శ్రావణ మాసంలో ఈ రాశులవారిపై డబ్బుల వర్షం కురిపిస్తున్న పరమ శివుడు

ఆగస్టు ఐదోతేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో లక్ష్మీదేవితోపాటు పరమేశ్వరుడిని పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది శ్రావణంలో సర్వార్థ సిద్ధి యోగడం ఏర్పడుతుండటంతో శ్రావణ మాసానికి మరింత విశిష్టత పెరిగింది. ఈ నెలలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. సర్వార్థ సిద్ధి యోగంతో కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతున్నారు. శ్రావణ మాసంలో పరమ శివుడి అనుగ్రహానికి లోనై విశేషంగా లాభాలను ఆర్జించే రాశుల వివరాలను తెలుసుకుందాం.

తులారాశి
వీరికి శ్రావణ మాసంలో పరమ శివుడి అనుగ్రహం లభిస్తుంది. వైవాహిక జీవితంలో వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రెండో సోమవారం వీరికి బాగా కలిసివస్తుంది.

four zodiac signs will get more money due to lord shiva blessings in sravana masam

సింహ రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. శ్రావణ మాసం వల్ల వీరి అదృష్టం రెట్టింపు అవవడంతోపాటు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. అనేక శుభవార్తలు చెవిన పడతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులభంగా విజయాన్ని అందుకుంటారు.

కన్యా రాశి
నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వీరు ఎంత శ్రమపడితే అంత ఫలితం లభిస్తుంది. అదనపు ఆదాయ వనరులు తోడవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.

మిథున రాశి
ఈ రాశివారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. అదనపు ఆదాయ వనరులు తోడవడంతోపాటు ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు. అలాగే కొంతకాలం క్రితం మొదలై పెండింగ్ లో ఉండిపోయిన పనులు కూడా ఇప్పుడే పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+