నాల్గవ రోజు లలితా దేవి అవతారం - నైవేద్యంగా అల్లం గారెలు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
శరన్నవరాత్రులలో నాల్గవ రోజు లలితా దేవి అవతారాన్ని కొలుస్తారు - నైవేద్యంగా అల్లం గారెలు పెడతారు.
అల్లం గారెలు కావలసినవి :-
మినపప్పు2 కప్పు
అల్లం చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కర్వేపాకు, కోత్తమిర తగినంత
నూనె 'గారెలు' వేయించేందుకు
అల్లం గారెలు చేసే విధానం :-
మినపప్పు బాగా కడిగి 4 లేదా 5 గంటలు నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి )
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి ఉప్పు, కాస్త తినే సోడ వేసి బాగా గ్రైడ్ చేసుకోండి. ఆ పిండిలో అల్లం, పచ్చి మిరపకాయలు కర్వేపాకు, కోత్తమిర, సన్నగా తరిగేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని గుండ్రంగా అదిమి నూనెలో వదలాలి. దోరగా వేగిన వడలను బయటకు తీసి అరటాకు కానీ విస్తరి ఆకులో కానీ వేసుకుని అమ్మవారికి నివేధన చేసి .. సహస్ర నామాలతో ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాము.












Click it and Unblock the Notifications