ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
దేవతలకు గురువైన బృహస్పతి ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి, సంతోషానికి, కీర్తిప్రతిష్టలకు, సంపదకు కారకుడు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగోతేదీన ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. 119 రోజులపాటు తిరోగమనంలో గురుడి ప్రభావం, ఆయన మార్గం మీనరాశి, మేషరాశిపై బాగా ప్రభావం చూపుతుంది. జ్యోతిష్యం ప్రకారం నాలుగు రాశులకు మంచి మేలు చేస్తుంది. గతేడాది అక్టోబరు తొమ్మిదో తేదీ నుంచి తిరోగమనంలో ఉన్నాడు గురుడు. ఆయన ప్రత్యక్ష కదిలకలు ఏయే రాశులపై ప్రభావం చూపుతుంది? వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యా రాశి
వీరికి అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో పురోగతి ఉంది. అంతకుముందున్న మార్గాల నుంచి కూడా డబ్బులు వస్తాయి. అదృష్టం బాగా ఉండటంతో గొప్ప విజయాన్ని సాధించడానికి బాటలు వేసుకుంటున్నారు. జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.

వృశ్చిక రాశి
పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారలకు అంతా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుస్తారు. ప్రయాణాల్లో మంచి లాభాలుంటాయి. పిల్లల నుంచి, బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
మేష రాశి
ఈ రాశి రెండో ఇంట్లో గురుడు సంచారం చేయడంవల్ల ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యలుతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తారు. జీవితంలో శాంతి నెలకొని మనశ్శాంతిగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఎటువైపు నుంచైనా, ఎలాగైనా రావొచ్చు. ఆర్థికంగా గురుడివల్ల ఒక స్థాయికి చేరుకుంటారు.
మకర రాశి
విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పనిచేసేచోట మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షినలు చేసి బృహస్పతిని పూజించండి.












Click it and Unblock the Notifications