గురు చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం.. వీరికి అఖండ ధనలాభం!
గురు, చంద్రుల కలయికతో శుభ యోగం గజకేసరి యోగం ఏర్పడుతుంది. మనస్సుకు సంకేతమైన చంద్రుని సంచారం మిధున రాశిలో జూలై 22వ తేదీ ఉదయం 8:14 గంటలకు మొదలవుతుంది. జ్ఞానాన్ని సూచించే గురువు అప్పటికే మిధున రాశిలో సంచారం చేస్తున్న క్రమంలో చంద్రుడు కూడా మిధునరాశిలోకి ప్రవేశించటంతో గురు, చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది.
గజకేసరి రాజయోగం
గజకేసరి రాజయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుంది. కొన్ని రాశులవారికి కెరీర్‌లో విజయాన్ని, వ్యాపారంలో లాభాలను అందిస్తుంది . మరి గజకేసరి రాజయోగం వలన ఏయే రాశుల వారు లాభాలు పొందుతారో, ఎవరికి ఎలా కలిసి వస్తుందో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి:
మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా అదృష్టం వరిస్తుంది . ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలను పొందుతారు. మిధునరాశి వారు కెరీర్‌లో కూడా విజయం సాధిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. చాలా కాలం నుంచి నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇది మిధున రాశి వారికి శుభకాలం.
కన్యా రాశి:
కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కన్యా రాశి జాతకులు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది వీరికి ఏ పని చేసినా విజయాలను ఇచ్చే కాలం.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగంతో అనేక ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. విదేశాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో జీవితంలో విజయం సాధిస్తారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications