వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తదియ నోములు వినాయక చవితి పండుగలకు శుభ ముహూర్తములు

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఈ సంవత్సరం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద మాసంలో తదియ నోములు మరియు వినాయక చవితి పండుగలకు శుభ ముహూర్తములు.

* తదియ నోములు:- తేదీ 30 ఆగస్టు 2022 మంగళవారం రోజు శుక్లపక్ష తదియ ఘడియాలలో తదియ నోములు నోచుకోవాలి ( తదియ తిధి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల వరకే ఉన్నది )

ఉదయం 10:38 నుండి 11 : 18 నిమిషాల వరకు మాత్రమే అనుకూలం.

* వినాయక చవితి పండుగ 31 ఆగస్టు 2022 బుధవారం రోజు శ్రీ గణపతి పూజకు శుభమూహూర్తములు ( చవితి ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు మాత్రమే ఉంది )

Ganesh Chaturthi 2022: know the shubh muhuraths for the festival

గృహమునందు సూర్యదయానికి పూర్వం నుండి ఉదయం 4 : 30 నుండి ఉదయం 7 : 45 వరకు.

మరియు ఉదయం 9 : 30 నిమిషాల నుండి 11: 30 వరకు వినాయక వ్రతం చేయవలెను.

ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోరా ప్రశస్తమైనది.

మధ్యాహ్నం 1 గంట నుండి 2 వరకు శుభకరమైనది. ( ఈ హోరాలో రాహుకాలం, యమగండం, గుళికా సమయం, వర్జ్యం, దుర్ముహూర్తం మొదలయినవి ఏవి ప్రభావితం కానేరవు )

వినాయక మంటపాలలో విగ్రహ ప్రతిష్టకు ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు ఆ తర్వాత ఉదయం 12 : 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 : 30 వరకు శుభం.

ముఖ్య సూచన :- శాస్త ప్రామాణీకతకు మరియు పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతినే పూజించండి. వినాయకుడి పూజ కొరకు వినియోగించే శాస్త్రీయ ప్రామాణికత మరియు దివ్య ఔషదా గుణాలు కలిగిన ఏకవింశతి పత్రాలైన 1. మాచీ పత్రం / మాచ పత్రి, 2. దూర్వా పత్రం / గరిక, 3. అపామార్గ పత్రం / ఉత్తరేణి, 4. బృహతీ పత్రం / ములక, 5. దత్తూర పత్రం / ఉమ్మెత్త, 6. తులసీ పత్రం / తులసి, 7. బిల్వ పత్రం / మారేడు, 8. బదరీ పత్రం / రేగు,9. చూత పత్రం / మామిడి, 10. కరవీర పత్రం / గన్నేరు, 11. మరువక పత్రం / ధవనం, మరువం, 12. శమీ పత్రం / జమ్మి, 13. విష్ణుక్రాంత పత్రం, 14. సింధువార పత్రం / వావిలి, 15. అశ్వత్థ పత్రం / రావి, 16. దాడిమీ పత్రం / దానిమ్మ, 17. జాజి పత్రం / జాజిమల్లి, 18. అర్జున పత్రం / మద్ది, 19.దేవదారు పత్రం, 20. గండలీ పత్రం / లతాదూర్వా, 21. అర్క పత్రం / జిల్లేడు. వీటిని మాత్రమే వాడండి.. ఇవి గణపతి దేవుడిదగ్గర నవరాత్రులు పెట్టి పూజిస్తే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. నవరాత్రులు ముగిసాక వీటిని చెరువులో నిమార్జనం చేస్తే కలుషితంగా ఉన్న నీళ్ళు వీటి ఔషదగుణ ప్రభావం వలన నీటిని శుద్ది చేస్తాయి.. డా. ఎం. ఎన్. ఆచార్య.

English summary
Know the shubh muhuraths for Ganesh chaturthi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X