• search

గురు పూర్ణిమ జై గురుదేవా

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

   డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
   ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
   యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
   పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
   సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

   అజ్ఞాన తిమిరాంధస్వ జ్ఞానాంజన శలాకయా
   చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:

   ఆషాడ పౌర్ణమి అంటే వ్యాసుని పూజించేరోజు.ఆధ్యాత్మ పరాయణుడైన వ్యాసుని మించిన సమాజ శాస్త్రజ్ఞులెవరు లేరు.వ్యాసమహర్షి జీవతం యొక్క సమగ్ర స్వరూపమును తెలిసినవాడు.జీవితం అంటే ఏవరికైన వెలుగు-నీడల దాగుడు మూతలాంటిది.ఆటు-పోటులు మరియు సుఖ-దుఖాల సమన్వయమే జీవితం అని మానిషి జీవితమంటే నలుపు తెలుపు దారాలతో నేయబడిన వస్త్రం లాంటిది,మంచి చెడుతో కలిసిన జీవితాలుంటాయని వ్యాసభగవానుని ఉద్యేశం.

   వ్యాసుడు మన సమాజమునకు నిజమైన గురువు. కాబట్టె వ్యాసపూజ-గురుపూజగా పిలువబడినది.వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా మనం వేడుక చేసుకుంటున్నాము.గురువు అనే పదం చాలా మహత్యం కలిగున్నది. 'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే నిరోధించేవాడు అని అర్ధం.అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అని భావం.నిజమైన గురువు మన మనసే మనిషి శుద్ధమైన మనసే మన నిజమైన గురువు.గురుతత్వం నీ నుండే ప్రారంభం కావాలి అని అర్ధం.తీసుకోవడం కన్న ఇవ్వడం నేర్చుకో అని భావం.

   Guru Purnima 2018: Why the festival is celebrated and all you need to know

   గురువు గోప్పదనం ఎంతటి గోప్పదో గ్రహిస్తే మనకు అర్ధం అవుతుంది.ఒక నిర్జీవ ( ప్రాణంలేని ) వస్తువును పైకి విసరవలెనన్నచో సజీవంగా (ప్రాణం) ఉన్న దానియొక్క అవసరం ఏలాఉండునో అదే విధముగా ఏమి తెలువని అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని గురువు తన శక్తి (బుద్ది ) తో మనిషిని జ్ఞానచైతన్యవంతునిగా తయారు చేస్తాడు.అజ్ఞానాంధకారమును దూరం చేసి జ్ఞాన జ్యోతిని వెలిగించును గురువు.

   గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
   గురు: సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమ:

   గురువు యొక్క సహాయంచే విశ్వ జ్ఞానం తెలుసుకోగలిగి,జీవితంలోని ఎత్తు పల్లాలను.సుఖ దుఖాలను జయించే శక్తి గురువు ద్వార తెలుసుకున్న శిష్యుడు అంటాడు నా గురువు బ్రహ్మ వలె సద్గుణములను సృష్టించువాడు.విష్ణువువలె అన్ని విషయాలలో రక్షగా నిలిచేవాడు.శివుని వలే అభయాన్నిస్తూ, అమ్మ నాన్న అన్ని తానైనిలిచేవాడు గురువు అని స్తుతించారు.

   శిశువుగా పుట్టి తల్లి దగ్గర అమ్మ,నాన్న,ఆక్క,అన్నా,ఆత్తా అనే కొన్ని చిన్ని చిన్ని పదాలు మాతృమూర్తి ద్వార నేర్చుకున్న బిడ్డడు అమ్మ ఒడి నుండి బడి బాట పట్టిన శిశువు గురువు ద్వారా అనేక ,అమూల్యమైన విషయాలను తెలుసుకుంటాడు.అమ్మ నాన్న గొప్పదనం గురువు ద్వారనే తెలుస్తుంది.ఒక గొంగళి పురుగు స్థాయిలో గురువు దగ్గర చేరిన శిష్యుడు గురుభోదనలో ఒక అందమైన సీతాకోకచిలుకగా మార్పు గురుసన్నిధిలో అవుతుంది.

   మన జీవితంలో గురువులుగా భావించే వారు అమ్మ,విద్యనేర్పిన గురువు,మంత్రోపదేశం చేసినవారు,ఆయుధ విద్య నేర్పిన వారు,వేదాధ్యయనము చేయించిన వారు,పురాణ ఇతిహాసాలను తెలియజేసిన వారు,దైవమార్గం వైపు నడిపించువారు,మహేంద్రజాలాది విద్యలు నేర్పిన వారు,మోక్ష సాక్షాత్కరము గురించి తెలియజేసినవారు గురువులు అవుతారు.

   మనకు వీరితో పాటు లోక గురువులు శ్రీ కృష్ణుడు, శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి,గురు దత్తత్రేయుడు,గురు రాఘవేంద్రుడు,శిరీడి సాయిబాబా మొదలగు వారు మనకు మానవీయ విలువలు తేలిపే అనేక మహిమాన్వీత హితోపదేశం చేసిన వారిని మనం ఈ రోజు ప్రత్యేకంగా పూజించుకుంటాము.

   ఈ గురు పూర్ణిమ రోజు గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుంది.జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా మన జాతక రాశి చక్రంలో ద్వాదశ భావాలలో ఏ భావం లో అయితే గురువు ఉన్నను లేదా అతని దృష్టి పడినను అక్కడ ఉండే చెడు ప్రభావం తొలగి మంచి కలుగుతుంది.అది గురు మహాత్యం అంటే శిష్యుడు తన సద్గురువు పాదాలపై తన తలపెట్టి మ్రొక్కి ఆశీస్సులు తీసుకుంటే ఆ గురువు మహిమ చల్లని చూపుల వలన శిష్యుడికున్న సమస్త దోషాలు తొలగిపోతాయి జై గురుదేవా.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Guru Purnima marks the appearance day of Srila Vyasadeva. It falls every year on the day of Ashadha Shukla Purnima. This year, the festival dedicated to teachers will be observed on July 27.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more