Happy mothers day 2024: రాశులవారీగా అమ్మల కోసం బహుమతులిలా ఇవ్వండి
మదర్స్ డే... మాతృ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. యూఎస్ వంటి దేశాల్లో అయితే మదర్స్ డే చాలా ప్రత్యేకత సంతరించుకునే రోజు. ఈరోజు పిల్లలంతా తమ తల్లులను బహుమతులతో ముంచేస్తారు. వారిని సంతోష పెట్టే పనిలో బిజీ అవుతారు. ఒక యునైటెడ్ స్టేట్స్ లోనే కాకుండా ఇతరదేశాల్లో కూడా ప్రతి సంవత్సరం మదర్స్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు.
మదర్స్ డే కు జ్యోతిష్యానికి లింక్
అయితే మదర్స్ డే కు జ్యోతిష్యానికి మధ్య కూడా ఒక అద్భుతమైన సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు అత్యంత కీలకమైన గ్రహం. ఈ గ్రహం మాతృత్వాన్ని సూచిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో తల్లిని సూచించే వ్యక్తిగా చంద్రుడు ఉంటాడు. చంద్రుని ప్రభావం తల్లి జీవితంపైన గణనీయంగా ఉంటుంది. ఇక మదర్స్ డే అయిన నేడు మీ అమ్మకు బహుమతులు ఇవ్వాలని ప్లాన్ చేసుకునేవారు మరి రాశుల ఆధారంగా బహుమతులివ్వడం అస్సలు మర్చిపోవద్దు.

రాశుల వారీగా అమ్మ మనసుకు నచ్చిన బహుమతులు
మేషరాశిలో పుట్టిన తల్లులకు మదర్స్ డే బహుమతిగా వాళ్లను ఎటైనా అవుట్ డోర్ అడ్వెంచర్ పార్కులకు తీసుకు వెళితే బాగుంటుంది. అంతేకాదు తనకు మంచి పుస్తకాలను బహూకరించినా బాగుంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించిన తల్లులకు మదర్స్ డే రోజున డిజైనర్ పర్ఫ్యూమ్ కానీ, వాళ్లకు ఇష్టమైన ఏదైనా ఆహారాన్ని కానీ బహుమతిగా ఇవ్వొచ్చు.
రాశిని బట్టి వాళ్ళ టేస్ట్
మిధున రాశిలో పుట్టిన తల్లులకు గృహాలంకరణ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇప్పటివరకు గృహాలంకరణ కు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన తల్లులకు వాళ్ల కోసమే స్పెషల్ గా తయారు చేసిన ఆల్బమ్స్ కానీ, గృహాలంకరణ వస్తువులు కానీ బహుమతిగా ఇవ్వొచ్చు.సింహరాశిలో జన్మించిన మాతృమూర్తులకు డిజైనర్ నగలు, డిజైనర్ హ్యాండ్ బ్యాగులు బహుమతిగా ఇవ్వొచ్చు.
మాతృమూర్తులకు ఇచ్చే గిఫ్ట్స్ వారి మనసుకు హత్తుకోవాలి
కన్య రాశిలో జన్మించిన మాతృమూర్తులకు వారిని స్పెషల్ ట్రిప్ తీసుకు వెళ్లడాన్ని, లేదా ఇంటిని అలంకరించుకోవడానికి ఏవైనా వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. తులా రాశిలో జన్మించిన తల్లులకు పూల బొకేలు, అద్భుతమైన కళాఖండాలు బహుమతిగా ఇవ్వొచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన మాతృమూర్తులకు ఏదైనా హై ఎండ్ పెర్ఫ్యూమ్ వంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.
అమ్మ మనసును చెప్పే రాశులు... అందుకే రాశులను బట్టి బహుమతులు
ధనుస్సు రాశిలో జన్మించిన తల్లులకు ప్రయాణ సంబంధిత వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. మకర రాశికి చెందిన మాతృమూర్తులకు స్పాకు తీసుకు వెళ్లడం కానీ, యోగ సెషన్ కు తీసుకు వెళ్లడం కానీ చెయ్యొచ్చు. కుంభరాశిలో జన్మించిన తల్లులకు ఆర్ట్ కిట్, ఏదైనా సృజనాత్మకత ఉట్టిపడే వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. మీనరాశిలో జన్మించిన తల్లులకు కళలకు సంబంధించిన బహుమతులు, పూల బొకేల వంటివి గిఫ్టుగా ఇవ్వొచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications