వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానపదుల ఇష్ట దేవత రేణుక ఎల్లమ్మ చరిత్ర..

ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారని, "బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక (యంత్రవాద్యం) వాయిసూ వీరావేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతోంది.

|
Google Oneindia TeluguNews

రేణుక ఎల్లమ్మ.. జానపదుల ఇష్టదేవత గ్రామగ్రామాన పలు పేర్లతో కొలువబడుతుంది. వైష్ణవంలో పరశురాముని తల్లిగా, శాక్షేయంలో పరాశక్తి సమరూపమైన భిన్నమస్తగా, శైవంలో పార్వతీస్వరూపంగా ఆమె ఎల్లరకూ అమ్మ, అందుకే జానపదులు ఎల్లమ్మ అని భజిస్తారు. జమదగ్ని పత్ని రేణుక జానపదుల కులదేవత.

ఎల్లమ్మ అనే పేరిట కొలుస్తారు.

వారి పాలిట అమె దురావతారం. ఆమెనే అమ్మలగన్న యమ్మ, ఆమేనే ముగురమ్మల మూలపుటమ్మ పోతన వంటి భక్త కవులు ఛందస్సులో తల్లి సుతులు రాస్తే, జానపదులు అమ్మ అన్న చిన్నపదంతో పరాశక్తిని స్వంతం చేసుకున్నారు. అమ్మ అన్న ఈ చిన్న పదంలోనే భక్తునికి, భగవతికి మధ్య ఉన్న దూరం సమసిపోతోంది.

పూజలు

పురానోక్తమైన పూజా విధానాలు, పూజలు, యూగాలు, క్రతువులు, దీక్షలు వంటివి సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనవి. జానపదుల భక్తివిశ్వాసాలు మాత్రం ప్రకృతితో మమేకమైనవి.

అందుకే ప్రకృతి శక్తులే సామానుల దైవస్వరూపాలైనాయి. దైవస్వరూపాలను ఆరాధిం అవకాశం కలుగజేసిన అమ్మ ప్రముఖ దైవతమైంది. కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వత్తి, లక్ష్మి సరస్వతి మొదలైన దేవతలు వారాహి, చండీ, బగళా వంటి శక్తులు శిష్ట వ్యవహారంలో వేర్వేరు కావచ్చు కానీ వీరంతా జానపదునికి అమ్మతల్లలె, అలాంటి అమ్మతల్లుల్లో అతి విశిష్టమైన శక్తి రేణుక ఎల్లమ్మ హైదరాబాదులోని ఎల్లమ్మ భక్తజనుల ఆరాధనలందుకుంటోంది.

History of goddess renuka yellamma

ఎల్లమ్మ ఎలా వెలిసింది. ?

వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భాగ్యనగరంలో ఎల్లమ్మ జలాధివాసిని, స్వయంవ్యక్త ఏడు వందల సంవత్సరాల క్రితం కుగ్రామమైన బల్కంపేటలో ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతుంటే పలుగుకు రాయి తగిలిందట. ఆ రైతు ఆ రాతిని పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి కనిపించింది.

ఆ విగ్రహాన్ని గ్రామంలోకి ఫేసుకువచేందుకు రైతు ఎంతగానో ప్రయత్నం చేసి, విఫలమై గ్రామసులనే అక్కడికే తీసుకువచ్చాడు. గ్రామస్తలతోపాటే వచ్చిన శివసతులు (శివారాధనలో ఉన్న స్త్రీలు) అమ్మవారిని అక్కడే ఉంచి పూజింటడం మేలని సలహానిచ్చారు. దానితో ఆ దేవతకు అక్కడే ఆలయం నిర్మించారు.

శివసతులు అమ్మవారి స్వరూపాన్ని చూసి నిర్ధారించారు. రెణుక అందరికి అమ్మ కనుక ఆమెను ఎల్లమ్మ అని వ్యవహరిస్తారు. ఈ రేణుకను శాక్లేయులు, శైవులు ఛిన్నమస్త అనే పేరిట పూజిస్తారు. తెలంగాణా ప్రాంతంలో ఎల్లమ్మ ఆరాధన అధికం.

ఓరుగల్లులో ఓరుగంటి ప్రసిద్ద దేవత.

-ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారని, "బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక (యంత్రవాద్యం) వాయిసూ వీరావేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతోంది. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే, తల మాదిగ వాడలో పడ్డది. అప్పటి నుంటి రేణుక వారీ , కులదేవతగా మారింది.

శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు వారంతా నృత్యంతో పూజించేవారు. నృత్యాలలో జవనికల వాయిద్యం ఉత్తేజాన్ని కలిగించేది.అమ్మవారి ఆలయంలో క్షేత్ర లకురాలిగా ఆరోగ్య ప్రదాయినియైన శీతలాదేవిని స్థాపించారు. శీతలాదేవినే జానపదులు పోచమ్మ పేరిట పూజిసారు. జలాధివాసినిగా అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఆమెను జలదుర్గా స్వరూపంగా ఆర్చిస్తారు.

ప్రస్తుతం ఆలయం ఏర్పడి, అర్చామూర్తులు వెలసినా, మూలస్వరూపమైన అమ్మవారిని జలాధివాసినిగా దర్శించవచ్చు. ఈ ఆలయంలో తొలిగా ప్రాక్ ముఖంగా ఉన మహాగణపతిదర్శనం లభిస్తుంది. ప్రక్కనేక్షేత్రపాలకురాలైన శీతలాదేవి (పోచమ్మ) దర్శనమిస్తుంది.

కొత్త దంపతులు పసుపుబట్టలతో అమ)వారిని దర్శించుకుంటే :

ఏ చింతలు లేకుండా సాగుతుందని నమ్మకం.ఆ పక్కనే 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిమ వద్ద నాగదోష, కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. ఆలయంలో మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న బావి నుంచి వచ్చే ఊటనీటినే భక్తులకు తీర్థముగా ఇస్తారు. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే కలరా, మశూచి, గట్టి, తామర వంటి వ్యాధులు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారీపోతాయని వారి నమ్మకం.

English summary
The story of origin of Yellamma is unique and is associated with Goddess Renuka the mother of Parashurama, an incarnation of Lord Vishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X