వేసవి సెలవులు పొడిగింపు, తాజా ఉత్తర్వులు..!!
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల ప్రారంభం పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది. జూనియర్ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్ విద్యామండలి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఓవైపు కొన్ని కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఉండటం, సిబ్బందికి పరీక్షల విధుల కేటాయించిన నేపథ్యంలో పునఃప్రారంభ తేదీని మార్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎండల తీవ్రత దృష్ట్యా మే నెలతో సెలవులు ముగిసి, జూన్ 1వ తేదీ నుంచే కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. కాలేజీల రీఓపెనింగ్ తేదీని జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. దీనివల్ల విద్యార్థులకు జూన్ 5వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ నిర్ణయంతో అదనంగా మరికొన్ని రోజులు విశ్రాంతి దొరకడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 6 నుంచి ప్రారంభం
ఇంటర్ బోర్డు అకస్మాత్తుగా సెలవులను పొడిగించడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలే ప్రధాన కారణంగా వెల్లడించారు. ఈ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జూనియర్ కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం, అధ్యాపకులు ఎగ్జామ్ డ్యూటీలలో బిజీగా ఉండటంతో ఒకేసారి కొత్త విద్యా సంవత్సరం తరగతులను ప్రారంభించడం వీలుపడదని బోర్డు భావించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ ముగిసేలా చూసేందుకే ఈ ఐదు రోజుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5తో సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి కాగానే, జూన్ 6వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంటర్ కాలేజీలు యథావిధిగా తెరుచుకుంటాయని, ఆ రోజు నుంచే రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications