సింహరాశి, కన్యారాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి సూర్యుడి ఆధీనంలో ఉంటుంది. కన్యా రాశి బుధుడి ఆధీనంలో ఉంటుంది. సింహ రాశి వారు అగ్ని తత్వానికి, కన్యా రాశి వారు భూ తత్వానికి చెందుతారు. ఈ రెండు రాశుల వారికి జీవితంలో, కెరీర్‌లో, ఆర్థికంగా బాగా కలిసిరావడానికి జ్యోతిష్య నిపుణులు సూచించే కొన్ని సులభమైన పరిహారాలను తెలుసుకుందాం.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. మరింతగా కలిసిరావాలంటే సూర్యుడి అనుగ్రహం చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి రాగి పాత్రతో నీటిని సమర్పించడం చాలా మంచిది. వీలైతే 'ఆదిత్య హృదయ స్తోత్రం' పఠించాలి. జ్యోతిష్యంలో సూర్యుడు తండ్రికి కారకుడు. కాబట్టి తండ్రి లేదా తండ్రితో సమానమైన పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఎరుపు, బంగారు , కుంకుమ రంగు దుస్తులు ధరిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. కాషాయ రంగు కూడా మంచిదే. ఆదివారం రోజు గోధుమలు లేదా బెల్లాన్ని ఆవుకు తినిపించడం వల్ల జాతకంలో సూర్య బలం పెరుగుతుంది.

కన్యా రాశి
కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. ఈ రాశి వారు చాలా తెలివైనవారు, ప్రణాళికాబద్ధంగా ఉంటారు. వీరికి వ్యాపారం, ఉద్యోగాల్లో బాగా కలిసిరావడానికి బుధుడి అనుగ్రహం ఉండాలి. బుధ గ్రహ దోషాలు తొలగి, అదృష్టం కలిసిరావడానికి వినాయకుడి ఆరాధన అత్యుత్తమం. ప్రతి బుధవారం గణపతికి గరిక సమర్పించి, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకుంటే విఘ్నాలు తొలగుతాయి. బుధుడికి ప్రియమైన రంగు ఆకుపచ్చ. ముఖ్యమైన డీలింగ్స్ లేదా ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం మంచిది. ప్రతిరోజూ లేదా బుధవారం నాడు పక్షులకు గింజలు వేయడం వల్ల కన్యా రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చెల్లెళ్లు, అత్తలు లేదా ఇంట్లోని మహిళలకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, వారిని గౌరవించడం వల్ల బుధుడు ప్రసన్నుడవుతాడు.












Click it and Unblock the Notifications