Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గృహ నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే అనర్థమే

ఇల్లుకట్టి చూడు పెళ్ళిచేసి చూడు అని ఊరికే అనలేదు పెద్దలు. గృహ నిర్మాణం . ఎన్నో సమస్యలు,మరెన్నో ఇబ్బందులతో కూడుకున్నది. అలాంటిది గృహ నిర్మాణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని వాస్తు శాస్త్ర పండితులు పలు రకాల సూచనలు చేస్తుంటారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఇంటిని నిర్మాణం చేసుకునే యజమానికి కొన్ని కోరికలు,అభిరుచులు వుంటాయి. వాటికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవాలి ఆశ పడుతుంటారు.

ఇల్లు కట్టుకునే ముందు తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు
ముందుగా గృహ నిర్మాణ సమయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి? మన అభిరుచులకు తగ్గట్టే గృహ నిర్మాణం చేసినప్పటికీ వాస్తు ప్రకారం ఎలా ఇంటిని నిర్మించుకోవాలి వంటి అనేక విషయాలను నేడు తెలుసుకుందాం. ఇల్లు కట్టుకునేవారు ముందుగా ఇసుక,ఇటుక, రాయి మొదలగు సామాగ్రిని చేర్చుకుంటారు. అలాంటపుడు ఈ సామాగ్రిని ఇంటికి నిర్మాణ సమయంలో ఇసుక, ఇటుక, రాయినీ ఉత్తర , ఈశాన్యలలో వేయకూడదు.

house construction vastu negative results those not follow these precautions while building house

ఇంటి నిర్మాణ సామాగ్రి విషయంలో వాస్తు పాటించకుంటే ఇబ్బందులు
గృహ నిర్మాణము చేయు సమయంలో ప్రధాన గృహము నైరుతిలో నిర్మాణమౌతుంది. కాబట్టి తూర్పు, ఉత్తరాలలో కాలి స్థలము ఉండటము వలన తూర్పు, ఉత్తరాలలో ఇసుక, ఇటుక, రాయి వంటి సామాగ్రిని వేస్తుంటాము. ఆ విధంగా చేయటం వలన నిర్మాణ సమయంలోనే సమస్యలు ఎదురౌతాయి. ఇది మీకు అనేక ఆటంకాలను కలిగిస్తుంది.

శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం చేసినచో ఈ విధమైన పలితాలు పొందుతారు
ఇంటి నిర్మాణ సమయంలో ఈశాన్యంలో బరువులుగా ఉండే ఇటుక,ఇసుక,రాయి లాంటి వాటిని వేయకుండా ఈశాన్యంలో బోరు మోటారు,లేదా కుళాయిలు నిర్మాణం చేసుకొని అందులో నీటిని నింపుకొని గృహ నిర్మాణ అవసరాలకు వాడుకోవచ్చు. ఆ విధంగా చేస్తే నిర్మాణ సమయంలో పని సులభంగా జరుగుతుంది వాస్తు నియమాలను పాటించినట్లు అవుతుంది .

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి నిర్మాణానికి ఈశాన్యం చాలా ప్రాధాన్యత ఉంటుంది
నలువైపుల గదుల నిర్మాణంలో, అలాగే ప్రహరీ నిర్మాణంలో, కొలతల ప్రకారం ఈశాన్యం వైపున ఖాళీ స్థలము ఎక్కువగా ఉండాలి. అదే విధంగా ఈశాన్యం పెరగాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ఇంటికి ఈశాన్యం పెరిగితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని అంటారు.

నైరుతిలో బరువైన వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం బరువైన వస్తువులను ఎప్పుడు ఇంటికి నైరుతి దిశ లోనే ఉంచాలి. ఇంటికి నైరుతిలో బరువైన వస్తువులను ఉండటంవల్ల రాహు గ్రహానికి శాంతి చేకూరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఈ దిశలో మరుగుదొడ్లు ఉండటంవల్ల రాహువు యొక్క ప్రభావం కచ్చితంగా ఆ కుటుంబం పైన ఉంటుంది.

గదుల నిర్మాణంలో ఈ పద్ధతులు తప్పకుండా పాటించాలి
తూర్పు ముఖంగా ఇంటి నిర్మాణము జరిగే గృహాలకు వెలుతురు వచ్చే విధంగా కిటికీలు అమర్చుకోవాలి. అదే విధంగా ఉత్తర దిశగా,తూర్పు దిశగా గాలి వెలుతురు ఇంటిలోకి ప్రవేశించే విధంగా ఉండాలి. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యరశ్మి ఇంటిలోపలికి రావడం వలన అనేక శుభాలు కలుగుతాయి. ఉదయం ఎనిమిదింటి లోపు వచ్చే సూర్యరశ్మి వలన ఆరోగ్యానికి అన్ని విధాల మేలు జరుగుతుంది. అందుకే తూర్పుదిశగా ఉన్న ఇళ్ళు మంచివి.

ఇంటి ముఖ ద్వారాల ఏర్పాటులో గమనిక
తూర్పు దిక్కున లేకుండా పడమట ముఖద్వారం కలిగిన స్థలాలు వున్నవారికి సూర్య రశ్మి రావడానికి ఇంటికి వెనకవైపు ద్వారం పెట్టుకోవాలి. అలా ద్వారం నిర్మించుకోవడం వలన లేత సూర్య కిరణాలు నేరుగా గృహంలోకి రావడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా ఉంటారు.

బెడ్ రూమ్ కు పూజ గదికి మధ్యలో ఒక నియమం
ప్రతి ఇంటిలో పూజగది,వంటగదికి వాస్తు శాస్త్ర ప్రకారం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
బెడ్ రూమ్ కు అడుగు దూరంలో ఈ రెండు గదుల నిర్మాణము అన్ని విధాలుగా శ్రేయస్కరం. పూజ గదిని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామో, వంటగదిని కూడా అంతే పవిత్రంగా చూడాలి అలా అయితేనే ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు.

వంటగది, పూజగది పక్కపక్కనే ఎందుకంటే
సహజంగా మనం నిద్ర లేచిన వెంటనే హాల్ లోకి వెళ్తాం. కాల కృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి చాలామంది ఇంట్లో దీపం వెలిగిస్తారు. దేవుడికి దీపం వెలిగించనా తరువాతనే వంట చేయడానికి సిద్ధం అవుతారు. ఇది శాస్త్రం ప్రకారం నియమము. అందుకే నిర్మాణ సమయంలో వంటగది,దేవుడి గది పక్కపక్కనే ఉండే విధంగా బెడ్ రూమ్ కి అడుగు దూరంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

ఇంటి నిర్మాణంలో వాస్తు పాటించకపోతే
ఈ విధంగా వాస్తు శాస్త్రం పాటించిన వారికి మంచి జరుగుతుంది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే గృహ నిర్మాణ సమయంలో ఈ చిన్న చిన్న వాస్తు నియమాలు పాటించరో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో వాస్తు పాటించకపోతే, అది మన ఇంట్లో ఉన్న సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంటిలోని వ్యక్తుల జీవితాలను గందరగోళానికి గురి చేస్తుంది. ఇది ఆరోగ్యం, సంబంధాలు మరియు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. కనుక తప్పనిసరిగా అందరూ వాస్తు నియమాలను పాటించాల్సిందే.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+