• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆఫీసుకు లక్ష్మీకళ రావాలంటే?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

సాధారణంగా గృహానికి సంపూర్ణ వాస్తు ఉంటే సరిపోతుందనుకుంటారు. అయితే ఆఫీసుకు కూడా వాస్తు అవసరమన్న విషయం తెలుసుకోవాలి. ఉద్యోగులు పనిచేసే ఆఫీసులు లక్ష్మీకళతో కళకళలాడుతుండాలంటే కళ్లు చెదిరే విపరీతమైన లైట్లు, తళతళలాడే అత్యాధునిక విదేశీ ఫర్నిచర్ ఉండగానే సరిపోదు. ఆ ఆఫీసుల్లో వాస్తు శాస్త్ర ప్రకారం దిశాదిశలు, సరైన దిశలో పెట్టాల్సిన బరువైన వస్తువులు, తీసేయాల్సిన అనవసర వస్తువులు ఇలా చాలా చాలా ఉంటాయి.

వీటన్నిటినీ సరిగా నిర్దేశించిన స్థలాల్లో వాస్తు ప్రకారం ఉంచితే ఆయా ఆఫీసులు బాగా అభివృద్ధి చెందుతాయి

వస్తువులు ఏ దిశగానైనా అమరిస్తే ఏమిటి? ఏ దిక్కుకైనా కూర్చుంటే ఏమిటి? అని అనుభవం ఉన్న వారు ప్రశ్నలు వేస్తుంటారు. వీటిని పట్టించుకోకూడదు. ఆఫీసు తూర్పుకేసి ఉంటే ఫ్లోరింగ్‌ పశ్చిమం నుంచి తూర్పుకేసి గానీ దక్షిణం నుంచి ఉత్తరానికి గానీ ఉండాలి. తూర్పువైపు తాకకుండా గోడకు తాకకుండా ఆగ్నేయంలో దక్షిణ దిక్కుకు ఆనుకొని ఆఫీసు బాసు కూర్చోవాలి.

How office looks rich?

బాసు ఉత్తర దిక్కుకేసి కూర్చోవాలి. గల్లాపెట్టె లేక అలమారు తన ఎడం వైపు పెట్టుకోవాలి.

ఒకవేళ బాసు తూర్పున అదే దిక్కుకేసి కూర్చుంటే గల్లాపెట్టె లేక అలమారు కుడిచేతివైపు పెట్టుకోవాలి. ఈ దిక్కున ఎలాంటి రణగొణధ్వని ఉండకూడదు. ఆఫీసు విషయంలో వాస్తు పాటించినట్లయితే ఆఫీసు పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థవంతంగా ఫలప్రదంగా పనిచేస్తారు. వారు ఆఫీసుకు ఉపయోగపడేవారని, భారం కారనీ రుజువు చేస్తారు.

ఆఫీసుకు తగిన చోటు, ఆకృతి, ఏటవాలు తదితరమైనవి, ఆఫీసులో వివిధ విభాగాలు, రిసెప్షన్‌ ఉన్న దిక్కులు వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాల అమరిక ఇలా ఎన్నో అంశాలను ఆఫీసుకు సంబంధించిన వాస్తు సూత్రాలు పరిగణనలోకి తీసుకుంటాయి. చక్కగా అలంకరించిన ప్రవేశం, సున్నితమైన సంగీతం వినిపిస్తూ ఉంటే కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇవి వాస్తుకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు.

ఇటీవల కూడా కార్పోరేట్ ఆఫీసులు, బ్యాంకులు ఇలాంటి మెళకువలను పాటిస్తున్నాయి.

అవసరంలేని సామగ్రి అక్కర్లేని కుర్చీలు బల్లలు, అపరిశుభ్రమైన చీకటి, ఇరుకుగా ఉండే ప్రవేశం వ్యాపారానికి చెడు చేస్తాయి. కస్టమర్లు, స్నేహితులు, లాభాలు, అవసమైన వారు దూరమవుతారు. ఒక ఎక్వేరియం లేక ఫౌంటెన్‌ ఉంటే కస్టమర్లను అతిథులను శాంతపరుస్తుంది. ప్రధాన ద్వారం ఇరుకైన దానికంటే విశాలమైనదిగా ఉండడం మంచిది. బాగా నగిషీ చెక్కిన పాతకాలపు చెక్కతలుపు ఉంటే ఎంతో హుందాగా గౌరవప్రదంగా ఉంటుంది. స్థిరత్వాన్ని సూచిస్తుంది. వ్యాపారం మెరుగుపడుతుంది.

పాతదైపోయి ఏవగింపుపుట్టించే తలుపు, అందులోనూ నాబ్‌ లేనిది, సరిగా తెరుచుకోనిది వెంటనే మరమ్మత్తులు చేయించాలి. ప్రవేశం వద్ద విండ్‌ చైమ్‌, వినాయకుడిని ఉంచితే సానుకూలమైన శక్తి పెంపొందుతుంది.

పనికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. అడ్డంకులు జొరబడేవారి నుంచి విముక్తి కలుగుతుంది. ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్ళీమళ్ళీ వస్తారు. శబ్దాలు చేసే తలుపులు కిటికీలు ఉండకూడదు. ఒకవేళ అలాంటివి కంటపడితే వెంటనే తైలం వేసి శబ్దం చేయకుండా జాగ్రత్త తీసుకోండి.

ఆఫీసులో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పండి. ఇది అత్యంత ప్రధానమైంది. సరైన వెలుతురు, తాజా పూలు, సుకుమారమైన రంగులు, అందమైన అలంకరణ, శబ్దం రానీయని ఫ్లోరింగ్‌, సన్నగా వినవచ్చే సంగీతం వినియోగించి ఆశించిన శాంత వాతావరణాన్ని సృష్టించండి. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు, వాటి ఫోటోలు, లేక మీ సేవలను వివరించే బ్రోచర్లు లాబీలో ప్రదర్శించండి. ఫోకస్‌ ఉన్న లైట్ల వెలుగులో వీటిని ఉంచాలి.

రిసెప్షన్‌లోకి అడుగుపెట్టగానే కస్టమర్‌ వీటివైపు ఆకర్షితుడవ్వాలి.

రిసెప్షన్‌ను ఈశాన్యం దిక్కుగా అమర్చండి. కానీ ఆఫీసులో ఈశాన్యం మూలను మాత్రం దేవతా విగ్రహానికి కేటాయించండి. ఏమీ లేకపోతే లైట్లతో పూలతో అలంకరించడండి. ఆఫీసు ఈశాన్యం మూల అతిథి గదులు ఉండకూడదు. అలా వున్నట్లయితే ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయి. నిజజీవితంలో ఉద్యోగ రంగంలో ఎదుగుదలను సంతోషాన్ని అడ్డుకుంటుంది. ఆఫీసు చైర్మన్‌ లేక నరల్‌ మేనేజర్‌ గది నైరుతిలోగానీ దక్షిణ భాగంలో గానీ ఉండాలి.

అతడు ఆఫీసు నైరుతి మూలన తూర్పుకేసి కూర్చోవడం మంచిది.

బాస్‌ నైరుతి మూలన బరువైన సేఫ్టీ లార్‌ ఉంచడం మంచిది. ఇందులో ముఖ్యమైన పత్రాలు కంపెనీ స్థిరచిరాస్తులకు సంబంధించిన పత్రాలు ఉంచాలి. ఈ సేఫ్‌ను గోడలోనే అమర్చడం మంచిది. అలాగే ఇతరులు చూడవలసి ఫైళ్ళు ఉంచడానికి గదిలో వాయువ్య దిశగా కొంత జాగా వుంచండి. మధ్యస్థాయి సిబ్బందిని ఉత్తరాన కానీ తూర్పున గానీ కూర్చునే ఏర్పాటు చేయాలి. ఆఫీసులో కేంద్ర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలి.

ఈచోటును ఖాళీగా ఉంచి నేలపై పూల మోటిఫ్‌ను గానీ ఓ కళాకృతినిగానీ పెట్టండి. లేక ఓ దేవతావిగ్రాహాన్ని ఉంచండి. చోటు శుభ్రంగా ఉంటుంది.

నిప్పు లేక వేడిపుట్టించే పరికరాలను ఆగ్నేయం మూల వుంచాలి. జెనరేటర్లు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రిక్‌ మీటర్‌, మెయిన్‌ కరెంటు స్విచ్చు, కంప్యూటర్‌ సర్వర్లు, ఆఫీసు టీ గది ఆగ్నేయం మూల నుంచాలి. ఎవ్వరూ దూలం కింద కూర్చోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా ఉన్నట్లయితే పనిచేసే టేబులును మరోచోటికి తర లించండి. ఈ నియమం కంప్యూటర్లకు ఇతర ఆఫీసు పరికరాలకు కూడా వర్తిస్తుంది.

పార్కింగ్‌, టాయిలెట్లకు, గిడ్డంగుకు, కస్టమర్లు కూర్చోడానికి చోటు, మెట్లు, లిఫ్టులు, వెలుపల పరిసరాలు, బిల్డింగ్‌ ప్రధాన ప్రవేశ ద్వారం ఇలా ప్రతి అంశానికి నిర్దిష్టమైన నియమాలున్నాయి.

ఆఫీసులో ఫ్లోరింగ్ తూర్పువైపునకుగాని, ఉత్తరంవైపుకుగాని, ఈశాన్యం వైపునకుగాని కాస్తంత స్లోప్‌గా వుండాలి. ఈ స్లోప్ ఆఫీసు ప్రధాన ద్వారంవైపు ఉండకూడదు. ఇలా పొరపాటున ఉంటే ఆఫీసుకు వ్యాపారంలో రావాల్సిన లాభాలు రావు. ఆఫీసు బిల్డింగ్ ఎత్తులో అన్ని దిక్కులు సరిసమానంగా ఉండాలి.తూర్పు ఎత్తుగా, ఉత్తరం ఎత్తుగా వుంటే ఆ ఆఫీసులో దరిద్రం తాండవిస్తుంటుంది. లాభాలు నష్టాలతో కలిసిపోతుంటాయి.

అనారోగ్య వాతావరణంలా ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత,పంచభూత,శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకల ఫోటో పెట్టండి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి.నీటి బానల్లో పుష్పాలను వేసి ఈశాన్య దిశగా ఉంచండి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి.

నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది. కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం ఆఫీసు అంతా వేయండి. నరదృష్టి తొలిగిపోతుంది.మాకు అన్ని తెలుసు అనుకునే కంటే ఒకసారి అనుభవం ఉన్న వాస్తు పండితులకు చూపించి వారిసలహాలను పాటించండి.

English summary
No matter how much money you have, you can still learn to class up your office look a little.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X