ప్రేమ పేరుతో వాడుకున్నారు.. ఇంక నో పెళ్లి - బుల్లితెర బ్యూటీ

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఒకప్పుడు ఎంతో దగ్గరైన పేరు ప్రియాంక నల్కార్. అచ్చమైన తెలుగమ్మాయిగా పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు.. ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో దక్కలేదు. అయితే తన ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగిన ప్రియాంక, తమిళ బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస సీరియల్స్, రియాలిటీ షోలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తోంది.

అయితే తెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ప్రియాంక జీవితంలో ఎన్నో బాధలు, కన్నీళ్లు, చేదు అనుభవాలు దాగి ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన జీవితంలోని అత్యంత కఠినమైన రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఎంతో నమ్మి ప్రేమించిన వ్యక్తి చివరకు తనను వదిలి వెళ్లిపోవడం తనను పూర్తిగా కుంగదీసిందని చెప్పింది. ఒక దశలో ఆ బాధను భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడించింది.

actress-nalka-priyanka-emotional-words-about-her-love-failure-and-marriage-decision-goes-viral-on-me

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "జీవితంలో అత్యంత నమ్మకంతో ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ బాధను మాటల్లో చెప్పలేం. నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను పూర్తిగా విరిగిపోయాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమలో ఎదురైన మోసం తర్వాత తాను తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని ప్రియాంక తెలిపింది. జీవితంపై ఆశలు కోల్పోయి, ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని ఆమె చెప్పిన మాటలు ప్రేక్షకులను కలచివేశాయి.

అయితే తన కుటుంబం గురించే ఆలోచించి ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చానని తెలిపింది. "నా కోసం కాకపోయినా నా కుటుంబం కోసం బతకాలి అనిపించింది. అదే నన్ను నిలబెట్టింది" అని భావోద్వేగంగా చెప్పింది. తన జీవితంలో కుటుంబమే అతిపెద్ద బలం అని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రులు, సోదరీమణుల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వెల్లడించింది.

తన సోదరీమణుల పెళ్లిళ్లు, ఇంటి బాధ్యతలు అన్నీ తన భుజాలపైనే ఉన్నాయని.. అందుకే తన ఆనందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమైందని పేర్కొంది. తన వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి కుటుంబం కోసం నిరంతరం శ్రమించానని చెప్పింది. కాగా ప్రియాంక గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆ బంధం నిలవలేకపోయింది. చివరకు ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది.

ఇక నా జీవితంలో పెళ్లి లేదు

ప్రస్తుతం మరోసారి ప్రేమ లేదా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో లేనని ప్రియాంక వెల్లడించింది. ఒకసారి ఎదురైన మోసాన్ని మర్చిపోవడం చాలా కష్టమని, మళ్లీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం తనకు లేదని చెప్పింది. ఒకసారి మోసపోయిన తర్వాత మళ్లీ అదే అనుభవం ఎదుర్కోవాలని అనిపించడం లేదు. నా జీవితంలోకి ఇక మరో వ్యక్తి రావడం కూడా నేను ఊహించుకోవడం లేదు. పెళ్లి గురించి కూడా ఆలోచించడం లేదు" అని స్పష్టంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+