వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. పాటించాల్సిన పద్దతులు ఇవే..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

ధనం మూలం మిధం జగత్ అన్నారు .ప్రతి వారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఎంత శారీరక శ్రమ చేసిన ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి.మనకు ఉన్న ఇఇతి భాదలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి. ఎవరి జాతకంలో ఏ మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి నిత్యం నిష్టగా ఈక్రింది శ్లోకాన్ని 108 సార్లు జపించాలి.

ఓం
"సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః

How to get Lakshmi Kataksham: Its rituals

ప్రతి ఇంట్లో కాని వ్యాపార సంస్థల్లో కాని ఒకే ఫ్రేంలో లక్ష్మి గణపతి యంత్ర , శైవ,వైష్ణవ సాంప్రదాయ నామ తిలకాలు మరియు ఓకారం స్వస్తిక్ గుర్తులు , విజయ అంజనేయ పతాకం నవ శక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతలా స్వరూపం అయిన గోమాత ఫోటోతో కలిసి అన్ని ఒకే ఫోటోలో డిజైన్ చేయబడి బొజ పత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన " ఐశ్వర్యకాళీ " ఫోటో గుమ్మంపై కాని దేవుని మందిరంలో లేదా మెన్ హాల్ తప్పక ఉండాలి.ఈ ఐశ్వర్యకాళీ అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి,శత్రు దృష్టి ,వాస్తు లోపాలు,గ్రహదోషాలు ,కుటుంబ, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు.

" ఐశ్వర్యకాళీ " అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మి అమ్మవారే .ఈ తల్లిని ఇంట్లో ,వ్యాపార సంస్థలలో ,ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారం పైన పెట్టుకుని ప్రతిరోజూ ఎర్రని పువ్వుతో అలంకరించుకుని దీప,దూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతం రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆ ఇంటి ఆవరణలోకి రానివ్వదు ... సకల సౌఖ్యాలను కలిగిస్తుంది.

స్తోమత కలిగినవారు మాత్రమే బంగారపు లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి. తప్పకుండా ధరించాలి అని నియమం ఏమి లేదు.ఇంట్లో మనకు ఇంతకు పూర్వం ఉంటేనే ధరించాలి.

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి.విగ్రహం గట్టిగా పూర్తీ లోహంతో కూడి ఉండాలి. విగ్రహం హాలో (బోల్) గా ఉంటే పనికి రాదు ఇది గమనించాలి.

ఆఫీసులో/ వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ, ధనప్రాప్తి కలుగుతుంది .

పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి.

గురు , శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.

శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు - శ్రీదేవీ భాగవతము

ప్రతి రోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది.

కమల సప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకా చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.

కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపార సంపద చేకూరుతుంది.

శుక్రవారం లక్ష్మీదేవిని అష్ట గంధాలతో (కర్పూరం,కస్తూరి, పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు, అత్తరు,శ్రీగంధం)తో పూజిస్తే కీర్తి , ప్రతిష్టతలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.జాతకరీత్యా ఉన్నదోషాలు కొంత తొలగిపోతాయి.

సౌందర్యలహరి లోని 33వ శ్లోకంను 45 రోజులు రోజుకు 1000 మార్లు పఠించాలి.పెసరపప్పు ,అన్నం ,తేనెను నైవేధ్యంగ సమర్పించిన అధిక ధనలాభము కలుగుతుంది.

మీ జాతకంలో కుటుంబ పరమైన, వివాహ పరమైన, ఆర్థిక, ఆరోగ్య, విదేశీయాన, రుణ బాధలు, ఇటువంటి మరి ఏ సమస్య ఉన్నట్లైతే మీ పుట్టిన తేది ఆధారంగా జాతక చక్రం కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారిచ్చే సలహాలు,సూచనలతో తగిన సులభ పరిహా పరిష్కారాలు చేసి శుభ ఫలితాలు పొందండి.ఈ వ్యాసంలో తెలిపిన శక్తి వంతమైన బోజపత్ర యంత్రం కలిగిన ఐశ్వర్య కాళీ అమ్మవారి ఫోటో కు సంబంధిన సమాచారానికి కాని సందేహాలు ఉన్నటైతే పగలు సమయంలో మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు జై శ్రీమన్నారాయణ.

English summary
Lakshmi Kataksham is used to word for Wealth from the Lakshmi goddess. Performing puja to Lakshmi devi will get wealth as they required.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X