శకునం: స్త్రీ శరీర భాగాలపై బల్లి పడితే ఏమవుతుంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

బల్లి శకునాలు స్త్రీపురుషులకు వేర్వేరుగా ఉంటాయి. పురుషుడి ఏ శరీర భాగంపై బల్లి పడితే ఏమవుతుందో ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు మహిళ ఏ శరీర భాగంపై బల్లి పడితే ఏం జరుగుతుందని నమ్ముతారో తెలుసుకుందాం.

శకునం: బల్లి శరీరంలోని ఏ భాగాలపై పడితే ఏమవుతుంది?

శరీరంపై బల్లి పడితే శుభ శకునాలు, అశుభ శకునాలు ఉంటాయని నమ్ముతారు. ఈ నమ్మకం ప్రాచీల కాలం నుంచి వస్తోంది.

 మహిళ తలపై బల్లి పడితే..

మహిళ తలపై బల్లి పడితే..

స్త్రీ తలపై బల్లి పడితే మరణ భయం ఆవహిస్తుందని నమ్ముతారు. జడపై పడితే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని సంకేతమంటారు. ఎడమ కంటిపై పడితే మీ పురుషుడు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తాడట.

 కుడి చెక్కిలిపై బల్లి పడితే....

కుడి చెక్కిలిపై బల్లి పడితే....

కుడి చెక్కిలిపై బల్లి పడితే మహిళలకు మగ పిల్లాడు పుడుతాడని సంకేతం ఇచ్చినట్లు అని చెబుతారు. పై కుడి చెవిపై పడితే ఆర్థిక ప్రయోజనాల చేకూరుతాయి. పై పెదవిపై పడితే మిమ్మల్ని వివాదాలు చుట్టుముడుతాయని సంకేతం. కింది పెదవిపై బల్లి పడితే కొన్ని కొత్త వస్తువులు సంక్రమిస్తాయి. రెండు పదవులపై పడితే వివాదాలు చుట్టుముడుతాయట

 వీపుపై బల్లి పడితే...

వీపుపై బల్లి పడితే...

స్త్రీల వీపుపై బల్లి పడితే వారు ఓ మరణ వార్త వినాల్సి వస్తుంది. గోళ్లపై పడితే వివాదం గానీ వైషమ్యం గానీ చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. చేతులపై పడితే ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఎడమ చేయిపై పడితే మానసిక ఒత్తిడికి గురవుతారు. వేళ్లపై పడితే మీ చేతికి ఆభరణాలు అందుతాయి. కుడి చేయిపై బల్లి పడితే రోమాన్స్ జరిపే అవకాశం ఉంది. భుజాలపై పడితే ఆభరణాలు వస్తాయి.

 తొడలపై బల్లి పడితే...

తొడలపై బల్లి పడితే...

తొడలపై బల్లి పడితే రోమాన్స్‌ను చవి చూస్తారు. మోకాలిపై పడితే మీరు ప్రేమాభిమానాలు పొందుతారు. చీలమండపై పడితే మహిళలు సమస్యలు లేదా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కుంటారు. కుడి కాలిపై పడితే మీరు అపజయాలను లేదా వైఫల్యాలను ఎదుర్కుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologers say, if the lizard falls on the left side of a man or the right side of a woman unfavourable results are predicted.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి