2025లో వీరికి డబ్బుల మూటలను విసిరేయనున్న బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు వస్తాయన్న విషయం తెలిసిందే. ఇక నవగ్రహాలలో గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గురు గ్రహాన్ని జ్ఞానానికి, విద్యకు, సంతోషానికి, సంపదకు ప్రతీకగా భావిస్తారు. జాతకంలో గురు గ్రహం శుభస్థానంలో ఉంటే సంపదకు ఎటువంటి లోటు ఉండదు. 12ఏళ్ళ తర్వాత బృహస్పతి మిధున రాశిలో సంచరిస్తాడు.

మిధున రాశిలో బృహస్పతి సంచారం
ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో సంచరిస్తోంది. 2025 సంవత్సరం మే వరకు బృహస్పతి వృషభ రాశిలోనే ఉంటాడు. ఆపై మిధున రాశిలోకి సంచారం చేస్తాడు. మిధున రాశిలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. 2025 సంవత్సరం మే నెలలో గురుగ్రహం మిధున రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక ఆ రాశుల వివరాల్లోకి వెళితే

Jupiter will throw bundles of money to these zodiac signs in 2025

వృషభ రాశి
బృహస్పతి మిధున రాశిలో సంచారం చేయడం వలన వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకుల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి అన్ని విధాల సానుకుల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారి బంధాలు బలపడతాయి. విదేశాలలో వ్యాపారాలు చేసే వారికి కూడా ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి.

మిధున రాశి
మిధున రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ గ్రహ సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో వర్తక వ్యాపారాలు లాభాలను చేకూరుస్తాయి. ఈ సమయం అన్ని విధాలుగా మిధున రాశి వారికి కలిసొచ్చే సమయం.

సింహరాశి
సింహరాశి వారికి గురుగ్రహ సంచారం ఎంతో సానుకూల ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారి ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి గురుగ్రహ సంచారం కలిసొస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+