ఏవరీ విశ్వకర్మ- సృష్టికి పూర్వమే....

విశ్వమంగళ మాంగళ్య విశ్వవిద్వా వినోదినే
విశ్వసంసార భీజాయ నమస్తే విశ్వకర్మణే
విశ్వాయ విశ్వరూపాయ నమస్తే విశ్వమూర్తియే
విశ్వమాత పితారూప విశ్వకర్మ నమోస్తుతే.

నిరుపమాన తేజోసంపన్నుడగు విరాట్ పురుషుని యొక్క అవతారము ఈ సృష్టికి పూర్వమే స్వయంభూవుగా వెలసిన రూపమే విశ్వకర్మ రూపం. అసలు విశ్వకర్మలు అంటే ఎవరు వీరు పూర్వపరాలు ఏమిటి అని గ్రహిస్తే పరమాత్మ విశ్వకర్మ ఐదు ముఖాలు,పది హస్తాలు కలిగిన రూపం.ఇతను ప్రధాన దేవతలకు కనిపించును ఇతనికి జయంతి అనునది "పుట్టుక" లేదు.

విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు.అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు.సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త.

 Jyothisham: Who is Vishwa Karma?

కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి,ఇది వాస్తవం కాదు వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభారతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది.సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

శ్లో|| నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ.(మూల స్తంభ పురాణం)

తాత్పర్యం:- భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము, మరియు బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - ఇంద్ర -సూర్య - నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు.ఐదు ముఖాలతో పంచ తత్వాలతో,పంచరంగులతో,పంచకృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడు.

శ్లో|| పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా|| విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగబ్రహ్మర్షి మను బ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినది.ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి.అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది.

పంచవృత్తులతో పాటు
వారు పంచవృత్తులతో పాటు

పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభువులకును ఉపయోగానికి మరియు తమ విజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే కళానైపుణ్యం వీరిది ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు.సమాజం నడవడానికి వీరి పాత్ర కీలకంగా ఉండేది.విశ్వబ్రాహ్మణులు పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తారు.ఇది వారి కుల వృత్తులలోభాగం.

పౌరోహిత్యం కూడా..
వారి వృత్తి పౌరోహిత్యం కూడా...

జ్యోతిషం, పౌరోహిత్యము చేసే విశ్వబ్రాహ్మణ కులస్థులు కూడా వైదిక బ్రహ్మణులే కనుక పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తియే.పూర్వకాలంలో,రాజ్యానికి శుభములు సమకూర్చేందుకు, పొరుగు దేశరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి,జ్యోతిషులను, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు.వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు జ్యోతిషుని, పురోహితుడునీ తప్పక ఆశ్రయించేవారు.

సమాజంలో ప్రధాన పాత్ర
వారిది సమాజంలో ప్రధాన పాత్ర

విశ్వబ్రాహ్మణుల వృత్తుల ద్వార సమాజ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తూ వస్తున్నారు. పూర్వం యంత్ర పరికరాలు రాకముందు పనులన్ని మానవ శ్రమతోనే ముడిపడి ఉండేవి.లోకంలో జీవనానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధాన ఆధారంగా ఉండేవి.ఈ విశ్వకర్మ కులంలో జన్మించిన వాడే శ్రీమద్వి విరాట్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన కుల వృత్తులను చేస్తూనే కాలజ్ఞానాన్ని చెప్పాడు.

నిష్టాగరిష్టులు
వారు నిష్టా గరిష్టులు

నిష్టాగరిష్టులైన ఈ విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులనే కాక జ్యోతిష, పౌరోహిత, యంత్ర, గృహవాస్తు నిర్మాతలుగా, ఆర్కిటేక్చర్లుగా, సివిల్ ఇంజనీయర్లుగా, రాజకీయ, సినిమా, టివి మొదలగు అనేక రంగాలలో నాటి నుండి నేటి వరకు సకల కళల యందు వీరి ప్రావీణ్యతను నిరూపిస్తూ ఈ విశ్వంనందు నిష్ణాతులై విరాజిల్లుతున్నారు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+