కార్తీక పౌర్ణమి నాడు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈ ఒక్క దానం చాలు!!
కార్తీక మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిధిలో 15వ రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈసారి వచ్చే కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది అని చెబుతున్నారు. సాధారణంగా కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ఇష్టమైనది. ఈ మాసంలో ఎవరైతే నిష్టతో శివుడిని, విష్ణుమూర్తిని పూజిస్తారో వారి పాప హరణం జరుగుతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు.
కార్తీక మాసంలో స్నానం , దానం, ఉపవాసం, దీపారాధన, జపం, అభిషేకం చేయడం ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారకముందే మహిళలంతా తలస్నానం చేసి, ఆరోజున చాలా ప్రత్యేకమైనదిగా భావించి, శివాలయాలలో శివుడికి రుద్రాభిషేకం చేసి పూజలు చేస్తారు.

నియమనిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు శివుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైన ఉసిరి చెట్టును పూజిస్తే సర్వ శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఇక కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి స్నానాన్ని చేయడం వల్ల కూడా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేయడంతో పాటు, మరొక ముఖ్యమైన పని చేస్తే మంచి జరుగుతుందని అది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటిని తెస్తుందని చెబుతున్నారు. ఇంతకీ కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉసిరికాయలను దానం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు.
కేవలం ఉసిరికాయలను దానం చేయడమే కాదు ఈ నెలలో దానధర్మాలు శుభాలను కలిగిస్తాయని, ఈ మాసంలో ఏది దానం చేసినా ఫలితం వెంటనే వస్తుందని చెబుతారు. ఈరోజు దీపదానం చేస్తే కూడా పుణ్యం లభిస్తుందని, బియ్యం పిండి, గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు, వెండి ప్రమిదలను దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, ఐశ్వర్యం లభిస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications