వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలసుకోండి.. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి..!!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1. అజీర్ణే భోజనమ్ విషమ్:- మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.

2. అర్ధరోగహరి నిద్రా:- సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.

Know the Ancient Indian tips for good health

3. ముద్గధాలి గధవ్యాలి:- అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ పెసలు (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

4. బాగ్నస్తి సంధనకరో రాసోనాహా:- వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.

5. అతి సర్వత్రా వర్జయేత్ :- అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.

6. నాస్తిమూలం అనౌషాధం:- శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.

7. నా వైద్యా ప్రభుయుయుషా:- ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.

8. చింతా వ్యాధి ప్రకాషయ:- చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.

9. వ్యాయమాశ్చ సనైహి సనైహి:- ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.

10. అజవత్ చార్వనం కుర్యాత్ :- మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.

11. స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం:- స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.

12. న స్నానం ఆచరేత్ భుక్త్వా :- ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.

13. నాస్తి మేఘసమం తోయం:- స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.

14. అజీర్నే భేజాజం వారీ:- మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.

15. సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం:- తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)

16. నిత్యామ్ సర్వ రసభ్యాసహా :- ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.

17. జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి :- మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.

18. భుక్త్వోపా విసస్థాంద్ర:- ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.

19. క్షుత్ సాధూతం జనయతి:- ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)

20. చింతా జరానామ్ మనుష్యానమ్ :- చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

21. సతం విహయ భోక్తవ్యం :- ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.

22. సర్వ ధర్మేశు మధ్యమామ్ :- ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి.

English summary
Some Ancient Indian health tips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X