వైభవ్ సూర్యవంశీ ఆస్తుల లెక్కలు.. బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..!?

Vaibhav Sooryavanshi: క్రికెట్ ఫ్యాన్స్ అందరి నోటా ఇప్పుడు వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్య వంశీ. ఈ యువ సంచలనం యావత్ క్రికెట్ ప్రపంచానికి అభిమాన ఆటగాడిగా మారిపోయాడు. చిన్న వయసులోనే బౌలర్ ఎవరైనా.. బౌండరీనే లక్ష్యంగా బంతిని బాదే తీరు కోట్లాది మందిని అభిమానులుగా మార్చేసింది. ఈ సెన్సేషనల్ ప్లేయర్ ఆస్తుల లెక్క ఇప్పుడు వైరల్ అవుతోంది. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ అటు ఆటలో.. ఇటు సంపాదనలో ముందు వరుసలో నిలిచాడు.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్‌వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున 2025లో క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పుడు వైభవ్‌కు 14 ఏళ్లు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ. 1.1 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 14 ఏళ్ల కుర్రాడికి అంత మొత్తం పెట్టడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ ఆడిన మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అక్కడ మొదలైన విధ్వంసం.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

వైభవ్ దూకుడుకు బ్రేకులు.. అవుట్ ఎలా చేయాలంటే.. జోఫ్రా ఆర్చర్ సంచలనం..!!
వైభవ్ దూకుడుకు బ్రేకులు.. అవుట్ ఎలా చేయాలంటే.. జోఫ్రా ఆర్చర్ సంచలనం..!!
vaibhav-sooryavanshi-net-worth-reported-to-have-a-residental-property-in-mumbai-which-is-valued-aro

వైభవ్ బ్రాండ్ వాల్యూ

వైభవ్ ప్రస్తుత ప్రదర్శనలు చూస్తే ఆ మొత్తం చాలా తక్కువనేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అతడి సంపాదన, బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయి నట్లు తెలుస్తోంది. వైభవ్ సూర్యవంశీకి ముంబైలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. అతడి స్వస్థలం బిహార్‌లోని సమస్తిపూర్‌లో రూ.60లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా వైభవ్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రతి సీజన్‌కు రూ.1.1 కోట్ల జీతం అందుకుంటున్న అతడు.. మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడినందుకు సుమారు రూ.1.65 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు అవార్డులు, బహుమతులు కూడా అతడి సంపాదనలో భాగమయ్యాయి. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ కూడా వైభవ్ సంపాదనను భారీగా పెంచుతున్నాయి. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+